Monday, 2 November 2026

December 2012

జాతీయం

నూతన సంవరత్సర వేడుకలను రద్దుచేసిన సైన్యం

న్యూఢిల్లీ : ఢిల్లీ అత్యాచార బాధితురాలి మృతికి సంతాపంగా సైన్యంలో నూతన సంవత్సర వేడుకలను రద్దుచేశారు. దేశంలొని అన్నీ సైనిక కార్యాలయాలు, కంటోన్మెంట్లలో వేడుకలు రద్దు చేస్తున్నట్టు సైనిక ఉన్నాతాధికారులు ప్రకటించారు. నూతన సంవత్సరం రోజున ప్రధాన సైనికాధికారి…

హైదరాబాద్

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలి : సుప్రీంలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి పిటిషన్‌

హైదరాబాద్‌: దేశంలో మహిళలపై జరుగుతున్న దాడుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌  కోర్టులను ఏర్పాటు చేయాలని కోరుతూ విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి ప్రమీల శంకర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంలో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు.…

జిల్లా వార్తలు

బాబుకు తెలంగాణ సెగ

వరంగల్‌ : జిల్లాలో వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబునాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. పరకాల మండలం లక్ష్మీపురంలో చంద్రబాబు పాదయాత్రను మహిళలు అడ్డుకుని జై తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో మహిళలకు పోలీసులకు మధ్య తోపులాట…

వార్తలు

పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌: మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సోమవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులు నారాయణపురం జిల్లా దౌడాయి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కరీంనగర్

కరీంనగర్‌ జిల్లాలో వృద్ధుడు సజీవదహనం

కరీంనగర్‌: ఇంటికి  నిప్పంటుకుని వృద్ధుడు సజీవదహనమయ్యాడు. ఈ ఘటన జమ్మికుంట మండలం మల్యాలలో చోటు చేసుకుంది. వృద్ధుడి సజీవదహనంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

హైదరాబాద్

అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా : గాదె వెంకటరెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణపై అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలనే గతంలో తెదేపా సమైక్యవాదాన్ని పక్కనబెట్టి తెరాసతో జట్టుకట్టిందని ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ విమర్శించారు. రాష్ట్ర సమైక్యంగా ఉండాలని  అఖిలపక్షంలో చెప్పానని…

జాతీయం

ఢిల్లీలో హెల్ప్‌లైన్‌ 181కు సాంకేతిక సమస్యలు

న్యూఢిల్లీ: దేశరాజధానిలో మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ 181కు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సిన హెల్ప్‌లైన్‌ అవిష్కరణ కార్యాక్రమం సాయంత్రానికి వాయిదా వపడింది.…

సీమాంధ్ర

పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు

అనంతపురం : పరిటాల రవి తనయుడు శ్రీరామ్‌పై పోలీసు కేసు నమోదైంది. కాంగ్రెస్‌ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి హత్యకు కుట్రపన్నారంటూ ఆయనపై ధర్మవరం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో అభియోగాలు నమోదు చేశారు. ఈకేసులో శ్రీరామ్‌తో పాటు పది మందిపై కేసు…

హైదరాబాద్

ధర్మాన ప్రాసిక్యూషన్‌ కేసు విచారణ మధ్యాహ్నానికి వాయిదా

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన ప్రాసిక్యూషన్‌ కేసు విచారణను సీబీఐ కోర్టు మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. ధర్మానను ప్రాసిక్యూషన్‌కు అనుమతించవద్దంటూ రాష్ట్ర మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని పున: పరిశీలించండని గవర్నర్‌ తిప్పింపంపిన విషయం తెలిసిందే.

జాతీయం

ఢిల్లీ పోలీసులకు నేడు అందనున్న ఫోరెన్సిక్‌, డీఎన్‌ఏ నివేదిక

న్యూఢిల్లీ :  వైద్య విద్యార్థినిపై అత్యాచారం ఘటనలో ఫోరెన్సిక్‌, డీఎన్‌ఏ నివేదిక నేడు ఢిల్లీ పోలీసులకు అందనుంది. ఈ కేసులో ఛార్జిషీట్‌ను బుధవారం నాడు దాఖలు చేస్తామని పోలీసులు తెలియజేశారు. ఇది వెయ్యి పేజీల వరకూ ఉండనున్నట్లు చెప్పారు.…