Saturday, 7 November 2026

December 2012

హైదరాబాద్

తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ రథసారధి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ తెలంగాణలోని క్రైస్తవులకు క్రిస్మస్‌ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. సర్వమానవి సమానత్వం , సౌభ్రాతృత్యం, సహనం, శాంతి, ప్రేమ, కరుణ వంటి క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని కేసీఆర్‌ తన…

వార్తలు

ఈనెల 27న తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం ఈ నెల 27న నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 28న అఖిలపక్ష భేటీ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతో తెదేపా అధినేత చంద్రబాబు భేటీకానున్నారు. అదేవిధంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలతో కూడా…

వార్తలు

ముఖ్యమంత్రిగా వీరభద్రసింగ్‌ ప్రమాణిస్వీకారం

హిమాచల్‌ప్రదేశ్‌: హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వీరభద్రసింగ్‌ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలో ఈ ఉదయం 10.30 నిమిషాలకు గవర్నర్‌ వూర్మిలా సింగ్‌ ప్రమాణస్వీకారం చేయించారు. హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వీరభద్రసింగ్‌ ఆరోసారి ప్రమాణస్వీకారం చేశారు.

జిల్లా వార్తలు

మంత్రాల నెపంతో మహిళపై దాడి

మల, మూత్రాలు తాగించిన గ్రామస్థులు శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలోని పిల్లుంగూడలో మంత్రాల నెపంతో ఓ మహిళపై గ్రామస్థులు దాడి చేశారు. మహిళకు గుండు గీయించిన గ్రామస్థులు ఆమెతో మల ,మూత్రాలు తాగించారు. బాధితురాలి కుమారుడి ఫిర్యాదు…

జాతీయం

బస్పు బోల్తా : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

గుత్తి : అనంతపురం జిల్లా గుత్తికి 10 కి.మా దూరంలో కర్నూలు జిల్లా ప్యాపిలి వద్ద మంగళవారం తెల్లవారుజామును వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రమ్య (26) మృతిచెందారు. బెంగళూరు…

వార్తలు

దంతెవాడలో ఘాతుకం

సహ జవాన్లను కాల్చి చంపిన  సీఆర్‌పీఎఫ్‌ జవాను ఛత్తీస్‌గఢ్‌ : దంతెవాడలో సీఆర్‌పీఎఫ్‌ 111వ బెలాలియన్‌లో మంగళవారం ఉదయం ఘాతుకం చోటుచేసుకుంది. సహ సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మరో జవాన్‌ డీవ్‌ తివారీ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు…

జాతీయం

ఢిల్లీ ఆందోళనల్లో గాయపడిన కానిస్టేబుల్‌ మృతి

ఢిల్లీ: ఇండియాగేట్‌ వద్ద ఆదివారం జరిగిన ఘర్షణలో గాయపడిన కానిస్టేబుల్‌ సుభాష్‌ తోమర్‌ (45) మృతిచెందారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. వైద్య విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా…

సీమాంధ్ర

బాలికపై ఉన్మాది దాడి : పరిస్థితి విషమం

గుంటూరు : పదేళ్ల బాలికపై ఓ ఉన్మాది దాడికి పాల్పడ్డాడు. గుంటూరు. జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలిక రత్నమాణిక్యాన్ని ఉన్మాది మెడ కొరికి తీవ్రంగా గాయపరిచాడు. బాలిక పరిస్థితి విషమించడంతో…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

అనంతపురం : జిల్లాలోని బెలుగప్ప మండలం ఎన్‌. గుండ్లపల్లి సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న నీటి ట్యాంకర్‌ను ఐషర్‌ వ్యాను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో…

సీమాంధ్ర

కేఎన్‌ఆర్టీసీ బస్సు బోల్తా : మహిళ మృతి

కర్నూలు : డోన్‌ మండలం కొత్తకోట గిడ్యా మిట్ట వద్ద మంగళవారం ఉదయం కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. మరో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులును సమీప ఆసుపత్రికి తరలించారు.