Saturday, 7 November 2026

December 2012

హైదరాబాద్

అఖిలపక్షానికి జగన్‌ హాజరుకావాలి : కవిత

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై డిసెంబర్‌ 28న కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్సీపీ అథినేత వైఎస్‌ జగన్‌ హాజరుకావాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. చంచల్‌గూడ జైళ్లోనే ఉండి కోర్టు అనుమతితతో యూపీఏ…

హైదరాబాద్

మహిళలపై దాడులు నిరసిస్తూ మహిళల ధర్నా

హైదరాబాద్‌: మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, దాడులను ఆరికట్టాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లో మహిళాసంఘాలు, స్వచ్ఛందనసంస్థలు నిరసన చేపట్టాయి. ఢిల్లీలో వైద్య విద్యార్ధినిపై జరిగిన సామూహిక అత్యాచారానికి వ్యతిరేకంగా ఇందిరాపార్కు వద్ద నల్లరిబ్బన్లు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా  శాంతియుత ధర్నా…

జాతీయం

ఇండియాగేట్‌ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

న్యూఢిల్లీ: ఇండియాగేట్‌ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు మరోసారి జలఫిరంగులు, భాష్పవాయువు ప్రయోగించారు. రాష్ట్రపతి భవన్‌ వైపు వెళ్లేందుకు యత్నించిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో చర్చించేందుకు సిద్ధమని కేంద్ర…

జాతీయం

రాష్ట్రపతి భవన్‌ వద్ద ఆందోళనలో బృందాకారత్‌

ఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌ వద్ద ఆందోళలనలో బృందాకారత్‌ పాల్గొన్నారు. ఘటనపై చర్చలు జరపడం కాదని బాధితురాలికి సత్వర న్యాయం అందించాని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించేలా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

హైదరాబాద్

లాఠీఛార్జీ అమానుషం : నారాయణ

హైదరాబాద్‌: ఢిల్లీలో ఇండియా గేట్‌ వద్ద నిరసనకారులపై లాఠీఛార్జీ చేయడం అమానుషమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. సామూహిక అత్యాచార బాధితురాలికి సత్వర న్యాయం అందించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

హైదరాబాద్

నిరుద్యోగుల జీవితంతో ఏపీపీఎస్సీ చెలగాటం

హైదరాబాద్‌: నిరుద్యోగుల జీవితాలతో ఏపీపీఎస్సీ చెలగాటమాడుతోందని దాడి వీరభద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది. గవర్నర్‌ తనకున్న అధికారాలను ఉపయోగించి ఏపీపీఎస్సీ సభ్యులను సస్పెండు చేయాలన్నారు.

జాతీయం

విద్యార్థులతో చర్చలకు సిద్ధం హోంశాఖ సహాయ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్‌

న్యూఢిల్లీ: విద్యార్థుల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. వైద్య విద్యార్ధినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియా గేట్‌ వద్ద ఆందోళన కొనసాగిస్తున్న విద్యార్థులతో చర్చలకు సిద్ధమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్‌పీఎస్‌ సింగ్‌ ప్రకటించారు. అత్యాచారానికి…

హైదరాబాద్

విజయమ్మతో కోదండరాం భేటీ

హైదరాబాద్‌: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మతో తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాంతోపాటు పలువురు ఐకాస నేతలు భేటీ అయ్యారు. ఈనెల 28న జరగనున్న అఖిలపక్ష సమావేశంలో వైకాపా తరపున ఒకే అభిప్రాయం చెప్పాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు.

జాతీయం

ఆందోళనకు ఆర్మీ మాజీ చీఫ్‌ వీకే సింగ్‌ మద్దతు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చోటుచేసుకున్న అత్యాచార ఘటన బాధాకరమని ఆర్మీ మాజీ చీఫ్‌ వికే సింగ్‌ అన్నారు. ఈ ఉదయం ఆయన ఇండియా గేట్‌ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగిన విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా…

హైదరాబాద్

గవర్నర్‌ తీసుకున్న నిర్ణయం సరైన చర్యే : దత్తాత్రేయ

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన ప్రాసిక్యూషన్‌ ఫైల్‌ను వెనక్కి పంపుతూ గవర్నర్‌ నరసింహన్‌ తీసుకున్న నిర్ణయం సరైన చర్యగా భాజపా నేత బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రాజ్యంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్న…