Friday, 6 November 2026

December 2012

హైదరాబాద్

ఎమ్మెల్యే కవితకు చేదు అనుభవం

హైదరాబాద్‌: ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సదస్సులో మహబూబాబాద్‌ ఎమ్మెల్యే  కవితకు చేదు అనుభవం ఎదురైంది. వేదిక వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వకుండా ఆమెను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే…

హైదరాబాద్

ఘనంగా సాయినాథ విగ్రహ ప్రతిష్ట

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో నూతనంగా నిర్మించిన సాయి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈసందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక్‌సత్తా నేత, స్థానిక ఎమ్మెల్యే జేపీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక…

హైదరాబాద్

భారతీయ వాయుసేనలోకి 31 మంది మహిళలు

హైదరాబాద్‌: దుండిగల్‌  ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ శనివారం ఒక చరిత్రాత్మక ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. అక్కడ పైలట్‌ శిక్షణ ముగించుకుని వాయుసేనలో చేరిన 221 మందిలో ఈ సారి 31 మంది మహిళలు ఉన్నారు. వారి పాసింగ్‌ అవుట్‌…

హైదరాబాద్

బస్సు ఢీకొని ఇద్దరి మృతి

హైదరాబాద్‌: బార్కాన్‌ సీఆర్‌పీఎఫ్‌ మెయిన్‌ గేట్‌ వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

హైదరాబాద్

కార్యకర్తలను గుర్తిస్తేనే భవిష్యత్‌: వీహెచ్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ బలపడాలంటే ముఖ్యమంత్రి కూడా కార్యకర్తలతో మమేకం కావాల్సిన అవసరం ఉందని సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశాంలో వీహెచ్‌ మాట్లాడారు. కార్యకర్తలను గుర్తిస్తేనే పార్టీకి భవిష్యత్‌ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం ప్రచురించిన…

హైదరాబాద్

సమావేశానికి హాజరుకాని జైపాల్‌రెడ్డి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశానికి పలువురు నేతలు గైర్హాజరయ్యారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి కోమటిరెడ్డి సమావేశానికి హాజరుకాలేదు.

హైదరాబాద్

విద్యారంగంపై రెండో తీర్మానం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఎల్బీ స్టేడియంలో జరుగుతోంది. ఇందులో విద్యారంగంపై రెండో తీర్మానాన్ని నేతలు ప్రవేశపెట్టారు. విద్యారంగ అభివృద్థికి తీసుకుంటున్న చర్యల గురించి నేతలు వివరించారు.

కరీంనగర్

కరీంనగర్‌ జిల్లాలో నేడు రెండో రోజు పాదయాత్ర

కరీంనగర్‌: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర కరీంనగర్‌ జిల్లాలో రెండో రోజుకు చేరింది. గర్రిపల్లి, రేగుంట, ఇటిక్యాల, రాయికల్‌ గ్రామాల్లో నేటి యాత్ర కొనసాగనుంది. మొత్తం 9 కిలోమీటర్ల మేర చంద్రబాబు యాత్ర…

జాతీయం

సంఝౌతా పేలుడు కేసులో కీలక నిందితుడు అరెస్ట్‌

న్యూఢిల్లీ: సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు పేలుడు కేసులో కీలక నిందితుడు రాజేశ్‌ చౌదరిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్‌ చేసింది. 2007లో ఇతను ఈ రైల్లో బాంబులు పెట్టినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు భావిస్తున్నారు. ఇతన్ని అరెస్ట్‌ చేసిన…

అంతర్జాతీయం

అలబామా ఆసుపత్రిలో కాల్పులు.. ముగ్గురికి గాయాలు

బర్మింగ్‌హామ్‌: అమెరికాలోని అలబామా రాష్ట్రం బర్మింగ్‌హామ్‌లోని సెయింట్‌ విన్సెంట్‌ ఆసుపత్రిలో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు. ఆసుపత్రిలో ఓ వ్యక్తి తుపాకీతో సంచరిస్తున్నాడే…