Tuesday, 3 November 2026

January 2013

హైదరాబాద్

ల్యాండ్‌పూలింగ్‌ విధివిధానాల రూపకల్పనకు కమిటీ

హైదరాబాద్‌: పట్టణ, నగర ప్రాంతాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ ప్రాజెక్టుల విధివిధానాలను రూపొందించేందుకు  రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. 15 రోజుల్లో దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హైదరాబాద్‌ నగరాభివృద్థి సంస్థ కమిషనర్‌ అధ్యక్షతన మున్సిపల్‌ సంచాలకులు,…

జిల్లా వార్తలు

కళాశాల బస్సు, లారీ ఢీ : ముగ్గురి మృతి

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా గణపురం మండలం మైలారం వద్ద కళాశాల బస్సు, లారీ ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. కళాశాల బస్సు డ్రైవరుతో పాటు మౌనిక, రష్మిని అనే ఇద్దరు విద్యార్థినులు అక్కడికక్కడే మరణించారు. మరో…

హైదరాబాద్

ఓఎంసీ. జగన్‌ కేసుల్లో నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓఎంసీ, జగన్‌ అక్రమాస్తులు, ఎమ్మార్‌ కేసుల్లో నిందితులైన గాలి జనార్థన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్‌, జగన్‌, సునీల్‌రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డిలకు సీబీఐ న్యాయస్థానం జనవరి 17 వరకు రిమాండ్‌ పొడిగించింది. ఈ కేసుల్లో నిందితులను సీబీఐ న్యాయస్థానం…

హైదరాబాద్

పోలవరం టెండర్లపై విచారణ ఈ నెల 30కి వాయిదా

హైదరాబాద్‌: పోలవరం టెండర్లపై విచారణను హైకోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. పోలవరం టెండర్లపై గతంలో ఇచ్చిన నిలుపుదల ఉత్తర్వులను కొనసాగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ లోగా ఒప్పందాలు చేసుకోవదని ప్రభుత్వానికి సూచించింది.

హైదరాబాద్

అరుణకు న్యాయం చేయాలని ఓయూ విద్యార్ధి సంఘాల నిరసన

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధిని  అరుణ హత్యకు నిరసనగా ఓయూ  న్యాయ కళాశాల వద్ద విద్యార్ధిసంఘాలు నిరసనకు దిగాయి. న్యాయ కళాశాల నుంచి సచివాలయం వరకు ప్రదర్శనగా బయల్దేరగా ఓయూ ఎన్‌సీసీ గేట్‌ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు.…

హైదరాబాద్

జైళ్లలో మతప్రచారం చేస్తున్నవారిపై కమిషన్‌లో ఫిర్యాదు

హైదరాబాద్‌: చర్లపల్లి జైల్లో అన్యమత ప్రచారం మత మార్పిడి చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అయ్యప్ప దీక్షలో ఉన్న తనను కొన్ని కారణాల వల్ల శాలిబండ పోలీసులు…

జిల్లా వార్తలు

పోలీసు శిక్షణ కళాశాలలో ధర్నా

రంగారెడ్డి : వికారాబాద్‌లోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణార్థులు ధర్నా చేపట్టారు. ఆహారం సరిగా లేదని, ఇతర సమస్యలపై 240 మంది శిక్షణార్థులు ఈ రోజు ధర్నాకు దిగారు.

జాతీయం

వాళ్ల తరపున మేం వాదించం : న్యాయవాదుల తిరస్కారం

న్యూఢిల్లీ : విద్యార్థినిపై బస్సులో అత్యాచారానికి పాల్పడి, తీవ్రంగా హింసించి ఆమె మరణానికి కారకులైన ఆరుగురు వ్యక్తుల  తరపున న్యాయస్థానంలో తాము వాదించబోమని ఢిల్లీ న్యాయవాదులు స్పష్టంచేశారు. సాకేత్‌ జిల్లా కోర్టులో రేపు విచారణ ప్రారంభం కావలసి వున్న…

హైదరాబాద్

మహిళా శాసనసభ్యురాలి ఇంట్లో అర్ధరాత్రి సోదాలా? తెదేపా

హైదరాబాద్‌: పరిటాల సునీత ఇంట్లో అర్థరాత్రి సోదాలు నిర్వహించి పోలీసులు ఓ మహిళ శాసనసభ్యురాలి గౌరవానికి భంగం కలిగించారని తెదేపా నేతలు మండి పడ్డారు. నేరస్తుడిమాటలు నమ్మి మహిళా ఎమ్మెల్యే పట్ల పోలీసులు ప్రవర్తించే తీరు ఇదేనా అని…

హైదరాబాద్

పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కార్లు ఢీ

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ వద్ద పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ హైవే దిగుతూ పిల్లర్‌ నెంబర్‌ 194 వద్ద మూడు కార్లు ఢీకొన్నాయి. వేగంగా ఫ్లైఓవర్‌ కిందకి దూసుకు వచ్చిన హ్యుందాయ్‌ ఐ-టెన్‌ కారు ముందువెళ్తున్న ఇండికాను ఢీకొని పల్టీ కొట్టింది.…