Wednesday, 4 November 2026

February 2013

హైదరాబాద్

నవోదయ సిబ్బంది సమ్మె : తల్లిదండ్రుల ఆందోళన

హైదరాబాద్‌: హైదరాబాద్‌ రీజియన్లో జవహర్‌ నవోదయ విద్యాలయ ఉపాధ్యాయులు, సిబ్బంది చేపట్టిన సమ్మె ఆరోజూ కొనసాగుతొంది. దాంతో సీబీఎస్‌ఈ 10,12 తరగతుల పరీక్షల నిర్వహణ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు లోనవుతున్నారు.

వార్తలు

తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ అజంఖాన్‌ రాజీనామా

ఉత్తరప్రదేశ్‌ : అలహాబాద్‌లో మహాకుంభమేళా సందర్భంగా నిన్న రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ కుంభమేళా ఇన్‌ఛార్జి పదవికి సమాజ్‌వాదీ పార్టీ నేత అజంఖాన్‌ రాజీనామా చేశారు.  ఈతొక్కిసలాటలో మృతుల సంఖ్య 37కు చేరింది.

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌లో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం వాంఖిడి వద్ద ఆర్టీసీ బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో అదుపు తప్పింది. డ్రైవరు బస్సును అదుపు చేసే ప్రయత్నంలో ఉండగానే ఇద్దరు వ్యక్తులు బస్సులో నుంచి బయటకు దూకారు. వారిలో ఒకరు…

హైదరాబాద్

బండ్ల గణేశ్‌ ఇంట్లో ఐటీ సోదాలు

హైదరాబాద్‌: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలిసింది.

హైదరాబాద్

రుణమాఫీపై కేంద్రమంత్రి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం : సోమిరెడ్డి

హైదరాబాద్‌: రైతుల రుణమాఫీపై కేంద్రమంత్రి సచిన్‌ పైలట్‌ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. రైతుల రుణమాఫీ సాధ్యం కాదని సీఎం ఎలా చెప్పగలిగారో సమాధానం చెప్పాలని, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కిరణ్‌కుమార్‌రెడ్డి…

వార్తలు

అఫ్జల్‌ గురు కుటుంబానికి మూడు రోజుల తర్వాత అందిన లేఖ

శ్రీనగర్‌ : అఫ్జల్‌గురు ఉరి శిక్ష అమలుపై అతని కుటుంబానికి సమాచారమిస్తూ ప్రభుత్వం పంపిన లేఖ అతని కుటుంబానికి సోమవారం అందింది. అఫ్జల్‌గురును శనివారం ఉదయమే తీహర్‌ జైలులో ఉరి తీసిన సంగతి తెలిసిందే. ఈ విషయం అతని…

హైదరాబాద్

ఈ నెల 12 నుంచి 15 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఈ నెల 12 నుంచి 15 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఈడీ తెలియజేశారు. హైదరాబాద్‌నుంచి ఇతర ప్రాంతాలకు 1200 ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆయన తెలియజేశారు.

హైదరాబాద్

ఎన్జీరంగా వీసీ నియామకంపై దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి నియామకంపై ప్రభుత్వ చర్యలను రాష్ట్ర హైకోర్టు సమర్ధించింది. ఉపకులపతి నియామకం నిబంధనలకు విరుద్ధమని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు నేడు కోట్టివేసింది. యాజీసీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉపకులపతి నియామకం జరిగిందని హైకోర్టు…

హైదరాబాద్

సమాచార హక్కు నియామకం : పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వానికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో…

జాతీయం

చిత్రావతి నదిపై అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంలో నిజదావా

న్యూఢిల్లీ : చిత్రావతి నదిపై కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ నిజదావా దాఖలు చేసింది. ప్రాజెక్టుల నిర్మాణం వల్ల పరగోడు రిజర్వాయర్‌కు నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుందని ఆందులో పేర్కొంది. అక్రమ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలోని…