Wednesday, 4 November 2026

March 2013

జాతీయం

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 40 పాయింట్లు, నిఫ్టీ 17 పాయింట్లు నష్టాపోయాయి. మెటల్‌, రియాల్టీ, ఆటో, బ్యాంకింగ్‌, అయిల్‌, గ్యాస్‌ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.

హైదరాబాద్

నేడు ఢిల్లీకి పీసీసీ అధ్యక్షుడు బొత్స, ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల ఖరారు చేయడం కోసం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం పర్యటన ఇంకా ఖరారు. కానప్పటికీ ఈ రోజు సాయంత్రం, రేపు ఉదయం కాని ఆయన…

సీమాంధ్ర

రైస్‌మిల్లులపై అధికారుల దాడులు

వినుకొండ : గుంటూరు జిల్లా వినుకొండలో రైస్‌ మిల్లులపై ఈరోజు ఉదయం అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 300 క్వింటాళ్ల చౌక ధరల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వార్తలు

గోడపత్రికలు అతికించిన మావోయిస్టులు

భద్రాచలం : అటవీశాఖ అధికారుల తీరుకు నిరసనగా ఖమ్మం జిల్లా భద్రాచలం మండలం నందిగామలో మావోయిస్టులు గోడపత్రికలు అంటించారు. గిరిజనులతో పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వని అటవీ అధికారులకు గోడపత్రికల ద్వారా మావోయిస్టుల హెచ్చరికలు జారీచేశారు.

హైదరాబాద్

రాజధానిలో నూడూ విస్తృత తనిఖీలు

హైదరాబాద్‌: నగరంలో ఉగ్రవాదులు మరోసారి బాంబు పేలుళ్లకు పాల్పడనున్నారనే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, ప్రార్థనా మందిరాలు, ప్రధాన బస్టాండ్లలో ఈ రోజు కూడా విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు. బుధవారం…

హైదరాబాద్

నేడు రాష్ట్ర మంత్రివర్గం భేటి

హైదరాబాద్‌: మూడు నెలల అనంతరం రాష్ట్ర మంత్రివర్గం నేడు సచివాలయంలో సమావేశం కానుంది. ఈ నెల 13 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం  కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు విద్యుత్‌ కోతలు, దిల్‌సుఖ్‌ నగర్‌ బాంబుపేలుళ్లు,…

Featured News

అగస్టా కుంభకోణంలో త్యాగిని ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ, మార్చి 6 (జనంసాక్షి):హెలికాప్టర్ల కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆర్మ్స్‌గేట్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్‌పీ త్యాగిని బుధవారం విచారించింది. వీవీఐపీల కోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలులో భారీ…

Featured News

ఈ అమ్మాయి ఐన్‌స్టీన్‌కన్నా మేధావి

లండన్‌ : భారతీయ సంతతికి చెందిన నేహారాము(12) మేథోశక్తి ప్రపంచాన్ని అబ్బుర పరుస్తోంది. ఆమె మేథస్సు ఐన్‌స్టీన్‌, స్టీఫెన్‌ హాకింగ్‌, బిల్‌గేట్స్‌లాంటివారి కంటే ఎక్కువ. వీరందరి మేథస్సు స్థాయి 160. నేహారాము 162 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించింది.…

Featured News

హైదరాబాద్‌హై అలర్ట్‌

హైదరాబాద్‌, మార్చి 6 (జనంసాక్షి): ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోవచ్చని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. హైదరా బాద్‌లో మరిన్ని దాడులు జరిగే అవకాశముందని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఆదేశించింది. ముష్కర మూకలు బుధ,…