Friday, 6 November 2026

April 2013

తెలంగాణ

జగన్‌కు కలిసిన ఎమ్మెల్యే కృష్ణదాస్‌

హైదరాబాద్‌; చంచల్‌గూడ జైలులో వైఎస్‌ఆర్‌ కాంగ్రేస్‌ పార్టీ అధ్యక్ష్యుడు,ఎంపి జగన్మోహన్‌ రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ ఈ రోజు కలిసారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ పరిస్థితిని జగన్మోహన్‌ రెడ్డి ధర్మానను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా…

జాతీయం

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల మృతి

మహారాష్ట్ర, జనంసాక్షి: మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా సిందేనూర్‌ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సిందేనూర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పౌరులు…

సీమాంధ్ర

బస్సు అదుపు తప్పి ఘోర ప్రమాదం

విజయనగరం, జనంసాక్షి : దాసన్నపేట రైతు బజారు వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. ఒక ప్రైవేటు బస్సు అదుపు తప్పి తోపుడుబండ్లపైకి దూసుకుపోయింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

తెలంగాణ

ప్రజలతో స్నేహంగా మెలిగేందుకే డయల్‌ 100: డీజీపీ

హైదరాబాద్‌, జనంసాక్షి : పోలీసులు, ప్రజల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తున్నామని డీజీపీ దినేశ్‌రెడ్డి చెప్పారు. డీజీపీ కార్యాలయంలో దినేశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలతో మరింత స్నేహంగా మెలిగేందుకే ‘డయల్‌ 100’ ప్రారంభించామని వెల్లడించారు. సాయం…

తెలంగాణ

ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ

బోనకల్‌, జనంసాక్షి : ఖమ్మం బోనకల్‌ మండలంలోని రావినూతల గ్రామంలో తాళ్లూరి రామకృష్ట అనే రైతు నుంచి ట్రాన్స్‌కో ఏఈ పాషా రూ. 30వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు పాషాను అదుపులోకి తీసుకున్నారు.

సీమాంధ్ర

ఎస్సీ కాలనీలో సీఎం ముఖాముఖి

గుంటూరు, జనంసాక్షి : ఇందిరమ్మ కలలు, ఎస్సీ ఎస్టీ ఉపప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలోని పలు అభివృద్ధి కార్యమ్రాలను ప్రారంభించారు. అనంతరం విజ్ఞానపురంలోని ఎస్సి కాలనీలో స్థానికలతో ముఖాముఖిలో…

సీమాంధ్ర

గుంటూరు-డోన్‌ మధ్య రైళ్ల రాకపోకల పునర్ధురణ

కర్నూలు, జనంసాక్షి : బేతంచర్లలోని సిమెంట్‌నగర్‌ వద్ద గెంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తోన్న గూడ్స్‌ రైల్లో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు. గుంటూరు-డోన్‌ మధ్య రైళ్ల రాకపోకలను రైల్వే అధికారులు పునరుద్ధరించారు.

సీమాంధ్ర

గూడ్స్‌ రైల్‌ ఇంజిన్‌లో మంటలు

కర్నూలు , జనంసాక్షి: బేతంచర్ల సిమెంట్‌నగర్‌ వద్ద గూడ్స్‌ రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలిక అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నారు. ఈ గూడ్స్‌ రైలు గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. ఈ ఘటన కారణంగా బుగానిపల్లి…

జాతీయం

జగన్‌ బెయిల్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్‌

న్యూఢీల్లీ , జనంసాక్షి: అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌ గూడ జైల్లో ఉన్న వైకాపా అధినేత జగన్‌ మరోసారి సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణ

పబ్బులపై హెచ్‌ఆర్సీలో పిటిషన్‌

హైదరాబాద్‌, జనంసాక్షి : నగరంలో పబ్‌లు యువతను పెడదారి పట్టిస్తున్నాయంటూ మానవహక్కుల కమిషన్లో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్సీ ఈ నెల 17లోగా పబ్‌ లపై నివేదిక ఇవ్వాలని హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనరను ఆదేశించింది.