తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
మహబూబ్‌నగర్: తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో అధికారులు నిలిపివేశారు. డీజిల్ ట్యాంక్ లీక్ అయినట్లు గుర్తించి మరమ్మతు పనులు చేపట్టారు.
మహబూబ్‌నగర్: తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో అధికారులు నిలిపివేశారు. డీజిల్ ట్యాంక్ లీక్ అయినట్లు గుర్తించి మరమ్మతు పనులు చేపట్టారు.
కరీంనగర్, జనంసాక్షి: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి హనుమాన్ జయంతి సందర్బంగా భక్తులు పోటెత్తారు. 41 రోజులపాటు దీక్ష నిర్వహించి హనుమాన్ మాలధారులు నేడు మాల విరమణకు సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. వివిధ జిల్లాల నుంచి భక్తులతో…
గుంటూరు: మాచవరం మండలం రాయవరంలోపాల తయారీ కేంద్రాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రసాయనాలతో కృత్రిమ పాలు తయారు చేస్తున్న ఓ యూనిట్‌ను సీజ్ చేసి విచారణ చేపట్టారు.
ముంబయి: స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
హైదరాబాద్: మలక్‌పేట మూసారంబాగ్‌లోని టింబర్ డిపోలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
న్యూఢిల్లీ: 2జీ కుంభకోణం ముసాయిదా నివేదికపై నేడు జేపీసీ కీలక సమావేశం నిర్వహించనుంది. అయితే నివేదికను ఓటింగ్‌తో తిరస్కరించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
ఖమ్మం: భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇందులో భాగంగా గోదావరి తీరంలో చక్రతీర్థం స్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
సీలేరు(విశాఖ): ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మత్లీ పోలీసు స్టేషన్ పరిధిలో నిన్న తెల్లవారుజామున ముగ్గురు గిరిజనులను మావోయిస్టులు అపహరించారు. ఇందులో ఇద్దరిని హతమార్చి వారి స్వగ్రామాలకు సమీపంలో మృతదేహాలను పడేశారు.
ఢాకా : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివారులోని సవార్ ప్రాంతంలో నిన్న ఎనిమిది అంతస్తుల వాణిజ్య భవన సముదాయం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ 140 మంది మృతి చెందినట్లు సమాచారం. ఘటనాస్థలి వద్ద సహాయక…
కడప: అట్లూరి మండలం బోడిశెట్టిపల్లిలో భర్త మందలించాడని ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.