Friday, 6 November 2026

June 2013

తెలంగాణ

ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు చేపడుతున్నాం: సీఎం

హైదరాబాద్‌ : ఉత్తరాఖండ్‌లో 3వేల మంది యాత్రికులు చిక్కుకుని ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అక్కడ ఇప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టినందున సహాయక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల బాధితుల బంధువులెవరూ ఆందోళన చెందవద్దని సీఎం కోరారు.

తెలంగాణ

శాసనసభ వాయిదా

హైదరాబాద్‌ : స్పీకర్‌ నాందెడ్ల మనోహర్‌ శాసనసభను సాయంత్రం 4.30 గంటలకు వాయిదా వేశారు.

తెలంగాణ

మరో ముగ్గురు మంత్రులు జైలుకు వెళ్తారు పయ్యాపుల

హైదరాబాద్‌ : త్వరలో మరో ముగ్గురు మంత్రులు జైలుకు వెళ్తారని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశప్‌ అన్నారు. శాసనసభలో కళంకిత మంత్రులపై చర్చ సందర్భంగా కేశప్‌ మాట్లాడుతూ… మంత్రులపై విచారణ జరపాలని హైకోర్టుకు వెళ్లింది తొలుత తెలుగుదేశం పార్టీయేనని…

తెలంగాణ

4:30 గంటలకు వాయిదా పడిన శాసనసభ

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ సాయంత్రం 4:30 గంటలకు వాయిదా పడింది. సభలో అధికార పక్షం ప్రతిపక్షం తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. కళంకిత మంత్రులను వెనకేసుకొచ్చిన సీఎంపై టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ దొంగల పార్టీ అన్న…

సీమాంధ్ర

ఏసీబీ వలలో వీఆర్వో

నరసరావుపేట : గుంటూరు జిల్లా నరసరావు పేట మండలం ఎల్లమంద వీఆర్వోగా పనిచేస్తున్న శివ కల్యాణ బాబు పట్టాదారు పాస్‌పుస్తకం జారీ చేయడానికి పెదతురపాలెంకు చెందిన సుభానీ అనే రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.

తెలంగాణ

ఉత్తరాఖండ్‌ సీఎంకు చంద్రబాబు లేఖ

హైదరాబాద్‌ : ఉత్తరాఖండ్‌ సీఎం విజయ్‌బహుగుణకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖరాశారు. వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించి క్షేమంగా స్వస్థలాలకు పంపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

సీమాంధ్ర

నకిలీ ఓట్లను ప్రక్షాళన చేస్తాం: భన్వర్‌లాల్‌

తిరుపతి,(జనంసాక్షి): రాష్ట్రంలో 40 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ పేర్కొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల వరకు నకిలీ ఓట్లను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుత ఓటర్ల జాబితా ఆధారంగా స్థానిక ఎన్నికలు…

తెలంగాణ

ఓయూ ఐకాస నేతలు అరెస్టు

హైదరాబాద్‌: చలో అసెంబ్లీ సందర్భంగా నమోదైన కేసులకు సంబంధించి పలువురు విద్యార్థి నేతలను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. ఓయూ ఐకాస అధ్యక్షుడు పిడమర్తి రవితో పాటు మరో ఇద్దరు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

తెలంగాణ

టీ కాంగ్రెస్‌ నేతల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ అంశం, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు టీ కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరుగుతుంది. సమావేశానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సారయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు…

తెలంగాణ

స్కూల్‌లో బాంబు లేదు

హైదరాబాద్‌ : దిల్‌షుక్‌నగర్‌లోని ఎస్‌. ఆర్‌ డిజీ స్కూల్‌లో బాంబు లేదని బాంబు లేదని బాంబు స్వ్కాడ్‌ నిర్ధారించింది. స్కూల్‌కు వచ్చిన ఫోన్‌ కాల్‌ బూటకపు బెదిరింపేనని పోలీసు అధికారులు తేల్చారు.