Thursday, 5 November 2026

July 2013

తెలంగాణ

కాప్రాలో 36 పాత భవనాలకు నోటీసులు

హైదారాబాద్‌,(జనంసాక్షి): కాప్రాలో 36 పాత భవనాలను జీహెజ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. పాత భవనాలను కూల్చివేయాలని అధికారులు పోటీసులు జారీ చేశారు. మోండా మార్కెట్‌ నాలా బజారులో ఓ పాత భవనాన్ని అధికారులు కూల్చివేశారు.

అంతర్జాతీయం

యూషెస్‌ తొలిటెస్ట్‌ లో బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

నాటింగ్‌హామ్‌,(జనంసాక్షి): ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య యూషెస్‌ సమరం ప్రారంభమయింది. ట్రెంట్‌బ్రిడ్జి మైదానంలో తొలిటెస్ట్‌ మ్యాచ్‌ బుధవారం ఆరంభమయింది. టాస్‌ గెలిచిన ఇంగ్లీషు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ కుక్‌, రూట్‌ ఓపెనర్లుగా బ్యాటాంగ్‌కు వచ్చారు. వరుసగా రెండుసార్లు…

సీమాంధ్ర

పోలీసు కాల్పుల్లో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమం

కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా జి. కొండూరులో పోలీసు కాల్పుల్లో గాయపడిన కృష్ణారావు అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అయనకు వైద్యులు కృత్రిమ శ్వాస ద్వారా చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ

రేవంత్‌ ఓ పిల్లకాకి: గట్టు రామచంద్రరావు

మెదక్‌,(జనంసాక్షి): టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఓ పిల్ల కాకి అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రరావు విమర్శించారు. టీడీపీ కాకిగోలకు వైఎస్‌ఆర్‌ సీపీ బెదరదన్నారు. కాంగ్రెస్‌ 2 తలల విషనాగు అని పేర్కొన్నారు. రాజకీయ ప్రాధాన్యత…

తెలంగాణ

హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర

హైదరాబాద్‌: జగన్నాథుని రథయాత్రలు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బుధవారం వైభవంగా సాగుతున్నాయి. గుజరాత్‌లో ఉదయమే రథయాత్ర ప్రారంభం కాగా ఒరిస్సాలోని పూరీలో మధ్యాహ్నం ప్రారంభమవుతోంది. హైదరాబాద్‌లోనూ జగన్నాథుని రథయాత్ర ఎన్టీఆర్‌ స్టేడియం నుంచి ఘనంగా ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో…

తెలంగాణ

తెలంగాణపై అభిప్రాయాలను సేకరిస్తున్న పీసీసీ చీఫ్‌ బొత్స

హైదరాబాద్‌: తెలంగాణపై మార్గసూచి విషయమై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ మంత్రులు, ముఖ్య నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత మంత్రులు, ముఖ్యనేతల అభిప్రాయాలను బొత్స తన నివేదికలో పొందుపర్చనున్నట్లు సమాచారం. రేపు ఉదయం బొత్స…

తెలంగాణ

ఆర్టీసీ సమస్యలపై సమావేశం నిర్వహించిన సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీలో నెలకొన్న సమస్యలపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తెలంగాణ

వైకాపాలో హంతకులు, రౌడీలే ఉన్నారు :వీహెచ్‌

హైదరాబాద్‌: వైకాపా నిజ స్వరూపం బయటపడిందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. హంతకులు, రౌడీలే ఆ పార్టీలో ఉన్నారని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. తెలంగాణ విషయమై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైఖరిలో మార్పు కనిపిస్తోందని…

జాతీయం

ఎంపీ పొన్నం ఇంట్లో సమావేశమైన టీ కాంగ్రెస్‌ ఎంపీలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణపై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. సమావేశంలో మధుయాష్కీ, ఆనంద్‌ భాస్కర్‌, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

జాతీయం

అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించిన షిండే

బీహార్‌: బుద్ధగయ పేలుళ్ల ఘటనలో మావోయిస్టుల పాత్ర సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని కేంద్ర హోం శాఖామంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వెల్లడించారు. మహాబోధి అలయంలో పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు…. అప్రమత్తంగా ఉండాలని…