Friday, 6 November 2026

July 2013

సీమాంధ్ర

ఏవోబీ సరిహద్దులో వాహనాల తనిఖీలు

శ్రీకాకుళం,(జనంసాక్షి): ఇచ్ఛాపురం వద్ద ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పోలీసులు వాహనాల తనిఖీలు జరిపారు. కటక్‌ నుంచి విశాఖకు తరలిస్తున్న రూ. 29 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ

విచారణకు హాజరైన ధర్మాన, సబిత

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు నాంపల్లి కోర్టులో ఈ ఉదయం విచారణకు హాజరయ్యారు.

జాతీయం

రాహుల్‌గాంధీకి చివరి టెలిగ్రామ్‌

న్యూఢిల్లీ : 163 ఏళ్లుగా భారతీయుల జీవితంలో భాగంగా మారిన టెలిగ్రామ్‌ సేవలు నిన్నటితో ముగిశాయి. చివరి రోజు కావడంతో అదివారం రాత్రి వరకూ తమ ఆప్తులకు పలువురు టెలిగ్రామ్‌లను పంపించారు. దేశ రాజధానిలో చివరి టెలిగ్రామ్‌ను కాంగ్రెస్‌…

తెలంగాణ

పార్థసారథిపై స్పీకర్‌కు ఫిర్యాదు

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రి సార్థసారథిపై అడుసుమిల్లి జయప్రకాశ్‌ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేశారు. ఫెరా ఉల్లంఘన కేసులో నిందుతుడైన పార్థసారథిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

సీమాంధ్ర

నామినేషన్‌ పత్రాలను అపహించిన దుండగులు

గుంటూరు: మంత్రి కాసుకృష్ణారెడ్డి సొంత గ్రామం నాదెండ్ల మండలం తూబాడులో నామినేషన్‌ పత్రాలను దుండగులు అపహరించారు. జంగాలపల్లి , చిరుమామిళ్ల, తూబాడు పంచాయతీల నామినేషన్‌ పత్రాలు అపహరణకు గురైనట్లు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యాలయం తాళాలు…

తెలంగాణ

నేటి పసిడి ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ రోజు నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,010 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.25,100గా ఉంది. కిలో…

ఖమ్మం

కేటీపీఎస్‌లో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

ఖమ్మం,(జనంసాక్షి): కేటీపీఎస్‌ నాలుగో యూనిట్లో సోమవారం సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ కారణంగా 60 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో నాలుగో యూనిట్లో ఏర్పడిన లోపాన్ని కనుగొని, విద్యుత్‌ ఉత్పత్తిని పునరుద్దరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

జాతీయం

పంచాయతీ ఎన్నికల్లో హింస …. ఇద్దరి మృతి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో హింస చోటుచేసుకుంది. బుర్‌ద్వాన్‌ జిల్లా మధుడంగా గ్రామ పంచాయతీ పోలింగ్‌ కేంద్రం వద్ద దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీపీఎం పార్టీ తరపున పోటీచేసిన అభ్యర్థి మనోహ్ర బీబీ…

జాతీయం

దక్షిణాది గ్రిడ్‌కు కూడంకుళం విద్యుత్‌

చెన్నై,(జనంసాక్షి): కూడంకుళం అణు విద్యుత్‌ కేంద్రంలో తొలి రియాక్టర్‌ విజయవంతం అయింది. నెలరోజుల్లో దక్షిణాది గ్రిడ్‌కు కూడంకుళం విద్యుత్‌ను అనుసందానం చేస్తామని అధికారులు తెలిపారు.

జాతీయం

స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.