Monday, 2 November 2026

2014 హాట్‌గురు ఎన్‌ఓఏఏ వెల్లడి

8
వాషింగ్టన్‌, నవంబరు 24 (జనంసాక్షి) : 2014 అత్యధిక ఉష్ణోగ్రతల సంవత్సరంగా నమోదైంది. ఉష్ణోగ్రతలపై అమెరికాకు చెందిన నేషనల్‌ ఓషనిక్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ అడ్మినిస్టేష్రన్‌ (ఎన్‌ఓఎఎ) సంస్థ తాజా వివరాలను వెల్లడించింది. ఈ సంవత్సరం  అక్టోబరు నుండి జనవరి వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.  అక్టోబరు మాసంలో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. అలాగే జనవరి నుండి అక్టోబరు వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, 1880లో రికార్డుచేయడం ఆరంభించిన తర్వాత ఇవే అత్యధిక రికార్డు సృష్టించాయని అమెరికాకు చెందిన నేషనల్‌ ఓషనిక్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ అడ్మినిస్టేష్రన్‌ (ఎన్‌ఓఎఎ) తెలిపింది. గడిచిన ఆరు మాసాల్లో ఐదు మాసాలు బాగా వేడిమిగా వున్నట్లు నమోదు అయింది. అందులో జులై మాసం నాల్గవ స్థానంలో వుందని ఎన్‌ఓఎఎ తన నెలవారీ నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం 2014 సంవత్సరం మొత్తంగా వేడిమి గల సంవత్సరంగా నమోదు కానుంది. అక్టోబరు మాసంలో ప్రపంచ వ్యాప్తంగా భూ ఉపరితలంపై, సముద్ర ఉపరితలంపై నమోదైన ఉమ్మడి సగటు ఉష్ణోగ్రత 14.74 డిగ్రీల సెల్సియస్‌ అయిన అమెరికా సంస్థపేర్కొంది. అంతకుముందు 2003లో వున్న రికార్డును 0.01 డిగ్రీల సెల్సియస్‌తో ఈ ఏడాది అధిగమించింది. సెంట్రల్‌ఆసియాలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలినఅన్ని చోట్లా సగటు కన్నా అధికంగానే వేడిమి నమోదైందని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *