
2014-15 రైల్వే బడ్జెట్ విశేషాలు..
* కొత్తగా జనసాధారణ్, 5 ప్రీమియం, 6 ఎసి, 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 8 ప్యాసింజర్, 5 మెము, 2 మెము సర్వీసులు, 11 రైళ్ల పొడగింపు
* ఎంపిక చేసిన రైళ్లలో ఆఫీస్-ఆన్-వీల్స్, ఇంటర్నెట్ వర్క్ స్టేషన్ సౌకర్యాలు
* కేరళకు కొత్త రైళ్లు కాని, కొత్త డబ్లింగ్ ప్రాజెక్టులు కాని కేటాయించలేరు..
* రైల్వేలలో ఎఫ్‌డిఐ కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన రైల్వే మంత్రి
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రూ.20,680 కోట్ల వ్యయంతో 29 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి
* గడిచిన 30 ఏళ్లలో మంజూరైన 674 ప్రాజెక్టుల్లో 317 మాత్రమే పూర్తి, మిలిగిన వాటి నిర్మాణానికి 1.8 లక్షల కోట్లు అవసరం
* అదనపు ఆదాయం కోసం రిటర్న్ టికెట్లకు ఆటోమెటిక్‌గా రాయితీ..* ఉత్తరాఖండ్‌లోని ఛార్ధామ్కు రైళ్ల అనుసంధానం
* అన్ని రైల్వే ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులను సమన్వయ పరిచేందుకు హాస్పిటల్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్..
* రైల్వే భూములను జిఐఎస్ మ్యాపింగ్, డిజిటైజేషన్
* ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కొన్ని స్టేషన్ల ఆధునీకరణ
* ఎపి, తెలంగాణలో నిర్మాణంలో ఉన్న 29 రైల్వే ప్రాజెక్టులు, విశాఖ-చెన్నై మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్
* ఎపి, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక కమిటి* బెంగుళూరు, ముంబై స్టేషన్లలో సౌకర్యాల మెరుగుదల
* వ్యాగన్ బుకింగ్‌కి ఆన్లైన్ సౌకర్యం
* ఈశాన్య ప్రాంత ప్రాజెక్టులకు అధిక కేటాయింపులు
* స్టాఫ్ బెనిఫిట్ ఫండ్ రూ.500 నుంచి రూ.800కు పెంపు.. ప్రతిభావంతులైన ఉద్యోగులకు ప్రత్యేక పథకం..
* అన్ని మెట్రో నగరాల్లోని స్టేషన్లను కలుపుతూ వజ్ర చతుర్భుజ్ లైన్
* 10 మెట్రో నగరాల్లోని రైల్వే స్టేషన్లలో అత్యున్నత సౌకర్యాల కల్పన
* కొత్త, నిర్మాణంలో ఉన్న రేవులను రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానం
* విజయవాడ ఢిల్లీ మధ్య ఏపి ఎక్స్‌ప్రెస్
* రైల్వేలలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్
* నిమిషానికి 7200టికెట్లు ఇచ్చేలా ఈ- టికెటింగ్ విధానం అమలు
* ఎంపిక చేసిన రూట్లలో రైళ్ల వేగం గంటకు 60 కిలోమీటర్ల నుంచి 200 కి.మీకు పెంపు
* అన్ని ఎ, ఎ1 క్యాటగిరి స్టేషన్లలో ఇంటర్ నెట్ సౌకర్యం
* నిజాముద్దిన్-సికింద్రాబాద్ మధ్య ప్రీమియం రైలు
* ఢిల్లీ-ఆగ్రా, చైన్నై-హైదరాబాద్, నాగ్‌పూర్-సికింద్రాబాద్, మైసూరు-బెంగుళూరు మధ్య హైస్పీడ్ రైళ్లు
* రైల్వే ఆస్తుల పరిరక్షణకు స్టేషన్ల చుట్టూ ప్రహరీగోడలు
* పోస్టు ఆఫీసు, మొబైల్ ద్వారా రైల్వే టికెట్ బుకింగ్…
* రైల్వేలలో పారిశుధ్యం మెరుగుదలకు గత ఏడాదికన్నా 40 శాతం అధిక నిధులు
* అన్ మ్యాన్డ్ లెవల్ క్రాసింగుల నిర్మూలనకు రోడ్ ఓవర్/అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.1785 కోట్లు కేటాయింపు
* రైల్వే సేవల నాణ్యత పెంపునకు రైల్వే టెక్నికల్, నాన్ టెక్నికల్ అంశాలతో విశ్వవిద్యాలయం
* అన్ని రైల్వే స్టేషన్లలో రిటైరింగ్ రూములు సౌకర్యం
* రైల్వే బోర్డు, రైల్వే మంత్రిత్వ శాఖ పునర్ వ్యవస్థీకరణ
* ముంబై-అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ రైలు
* అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఫుడ్ కోర్టుల ఏర్పాటు, కీలక రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం..
* జ్యోతిర్లింగాల సర్క్యూట్ తరహాలో అరుదైన పర్యాటక ప్రదేశాలకు టూరిస్టు ప్యాకేజ్ రైళ్లు
* ప్రయోగాత్మకంగా కొన్ని స్టేషన్లలో కాయిన్ ఆపరేటెడ్ ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్ల ఏర్పాటు
* మొబైల్ ఫోన్ల ద్వారా రైల్వై టికెట్ బుకింగ్, రైల్వే స్టేషన్లలో శుద్ధిచేసిన మంచి నీటి సౌకర్యం
* రైళ్లలో ఆటోమేటిక్‌గా తలుపులు మూసుకుపోయే పైలట్ ప్రాజెక్ట్ ప్రవేశపెట్టే ప్రతిపాదన
* 50 ప్రధాన రైల్వే స్టేషన్లలో పారిశుధ్యం బాధ్యతను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగింత
* రైల్వే స్టేషన్లలో పారిశుధ్యంపై సిసిటివిల ద్వారా నిఘా
* అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిలు..
* న్యూఢిల్లీ-అమృత్సర్, అమృత్సర్-జమ్మూ తావి మధ్య పైలట్ ప్రాజెక్టు..
* రైళ్లలోని హౌస్ కీపింగ్ సర్వీసులను అన్ని ముఖ్యమైన రైళ్లలో అందుబాటులోకి..
* రైల్వే స్టేషన్లు, రైళ్లలో పరిశుభ్రతకు ప్రధాన్యత
* రైళ్లలో క్యాటరింగ్ సర్వీసును మెరుగుపరిచేందుకు ప్రముఖ బ్రాండ్లకు అనుమతి..
* అన్ని ప్రధాన రైల్వై స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు పిపిపి పద్ధతి ద్వారా ఏర్పాటు
* 2014-15 రైల్వేల అంచనా వ్యయం రూ.1,49,176 కోట్లు…
* ఏసి కోచ్‌లలో నాణ్యమైన దుప్పట్ల సరఫరాకు లాండ్రీలు.. ఆర్ఓ తాగునీరు ఏర్పాటు
* 12వేల కానిస్టేబుల్స్‌తో రైళ్లలో భద్రత కట్టుదిట్టం
* రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం 4000 లమంది మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ నియామకం
* 2014-15లో స్థూల ప్రయాణికుల రవాణా ఆదాయం రూ.1,64,374 కోట్లుగా అంచనా..
* 5400 గేట్లు లేని లెవల్ క్రాసింగ్‌లు తొలగింపు..
* ప్రయాణికుల రవాణాలో 12.9 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా..
* రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులకు అలర్ట్ సందేశం పంపేందుకు రైల్వే కాల్ సెంటర్ ఏర్పాటు…
* 18 కొత్త లైన్ల సర్వేలు, డబ్లింగ్, 3, 4వ లైన్లు, గేజ్ మార్పిడి కోసం 10 సర్వేలు
* మారుమూల ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, ఎపి, తెలంగాణలోని ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు పెంపు…




