Wednesday, 4 November 2026

2015 మార్చి నాటికి నాగోలు-మెట్టుగూడ మెట్రో రైలు ప్రారంభం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 : వచ్చే ఏడాది ఉగాది (2015 మార్చి) నాటికి నాగోలు-మెట్టుగూడ మెట్రోరైలును ప్రారంభించనున్నట్లు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ ఎండి ఎన్‌విఎస్‌ రెడ్డి తెలిపారు. శనివారం మియాపూర్‌, ఎస్‌ఆర్‌ నగర్‌ మార్గంలో నిర్మిమవుతున్న సనత్‌నగర్‌ రైల్వే వంతెన ప్రక్కన జరుగుతున్న మెట్రోరైల్‌ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రోప్రాజెక్టు రెండవదశ మియాపూర్‌-ఎస్‌ఆర్‌నగర్‌ మార్గాన్ని వచ్చే ఏడాది ఆగస్టు (2015) 15న ప్రారంభించనున్నట్లు చెప్పారు. స్థానికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని వాటిని సానుకూలంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *