Friday, 6 November 2026

February 2015

హైదరాబాద్

కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

హైదరాబాద్‌ (జ‌నంసాక్షి) : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్‌ చేశారు. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయనకు చంద్రబాబునాయుడు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు

సీమాంధ్ర

చంద్రబాబు రైతు వ్యతిరేకి: హర్షకుమార్‌

తూర్పుగోదావరి (జ‌నంసాక్షి) : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రపంచంలోనే పెద్ద రైతు వ్యతిరేకి అని మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆరోపించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ చేయడం లేదన్నారు. గోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా…

సీమాంధ్ర

ట్రిపుల్‌ఐటీ నుంచి విద్యార్థి పరారీ

కృష్ణా (జ‌నంసాక్షి) : జిల్లాలోని నూజివీడు ట్రిపుల్‌ఐటీ నుంచి ఓ విద్యార్థి పరారైనట్లు తాజా సమాచారం. సూసైడ్‌ నోట్‌ రాసి వెళ్లి పోవడంతో కళాశాలలోని తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.

జిల్లా వార్తలు

మూతబడిన రైస్‌ మిల్లులో బాలుడి హత్య

మహబూబ్‌నగర్‌ జ‌నంసాక్షి : జిల్లాలోని అచ్చంపేట, ఇంద్రానగర్‌కాలనీలో నాలుగేళ్ల బాలుడిని దుండగులు హత్య చేశారు. ఓ మూతబడిన రైస్‌మిల్లులోకి బాలుడిని తీసుకెళ్లి గొంతునులిమి చంపినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

జిల్లా వార్తలు

రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి మృతి

వరంగల్‌ జ‌నంసాక్షి : రైలు ఢీకొని ఓ రైల్వే ఉద్యోగి మృతిచెందాడు. జిల్లాలోని డోర్నకల్‌ స్టేషన్‌లో ఈ ప్రమాదం జరిగింది. మరమత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణకు ఆదేశించారు.

వార్తలు

ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్

విశాఖపట్నం,(జ‌నంసాక్షి) : రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కే జోజి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు సోమవారం రాత్రి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి… పలు డాక్యుమెంట్లు స్వాధీనం…

సీమాంధ్ర

తునిలో గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తుండగా ప్రమాదం

తూర్పు గోదావరి  జ‌నంసాక్షి : తూర్పు గోదావరి జిల్లా తునిలో గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది. సిలిండర్‌ పేలి ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

సీమాంధ్ర

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం

అనంతపురం: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతపురం జిల్లా ధర్మవరం సాయినగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

జాతీయం

అనిల్ గోస్వామిని ప్రశ్నించిన సీబీఐ

కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అనిల్ గోస్వామిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. శారద గ్రూప్ కుంభకోణం కేసులో ఆయన నుంచి వివరాలు రాబట్టారు. ఈ కుంభకోణంలో నిందితులను కాపాడేందుకు తమ అధికారులపై ఆయన ఒత్తిడి చేశారని సీబీఐ ఫిర్యాదు…

తెలంగాణ

‘ఆ ఎన్నిక జరిగిన తీరుకు సిగ్గుపడుతున్నా’

హైదరాబాద్,(జ‌నంసాక్షి) : రాష్ట్ర విభజన చట్టంలో  భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కోటి సంతకాల సేకరణ కొనసాగుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రజల మద్దతుతో పాటు ఢిల్లీలో అన్ని పార్టీల మద్దతు…