Monday, 2 November 2026

March 2015

హైదరాబాద్

భూముల క్రమబద్దీకరణపై కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం భూముల క్రమబద్ధీకరణపై సచివాలయంలో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. జీవో 58,59లపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన ఈ సమీక్ష జరుపుతున్నారు.

అంతర్జాతీయం

పెరూలో లోయలో పడ్డ బస్సు:21 మంది మృతి

హైదరాబాద్:పెరూలోని ఆయాకుచో ప్రావిన్స్‌లోని ఆండీస్ పర్వత శ్రేణుల సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిన ఈ ఘటనలో 21 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక…

Featured News

చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుంది

చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందన్నారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల గ్రామంలో పెద్ద చెరువు పూడికతీత పనులను కేటీఆర్ ప్రారంభించారు. మిషన్ కాకతీయ కార్యక్రమానికి గ్రామస్తులు సహకరించాలని మంత్రి కోరారు. పూడిక తీసిన మట్టిని…

అంతర్జాతీయం

వివాదాస్పద వీడియో పోస్ట్.. యువకుడి అరెస్ట్

సింగపూర్:  సింగపూర్ జాతిపిత, వ్యవస్థాపక తొలి ప్రధాని, ఇటీవల మరణించిన లీ క్యుయాన్ యోపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన 16ఏళ్ల  టీనేజర్ అమోస్ యీ పాంగ్ కౌన్ను సింగపూర్  కోర్టు విచారించింది. వరుసగా మూడురోజులపాటు ఓ మతాన్ని కించపర్చేలా…

హైదరాబాద్

నాగపూర్‌ కేంద్ర కారాగారం నుంచి ఐదుగురు ఖైదీల పరారీ

హైదరాబాద్‌ : మహారాష్ట్రలోని నాగపూర్‌ కేంద్ర కారాగారం నుంచి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. ఈ తెల్లవారుజామున రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య వీరు ఐదుగురూ పారిపోయారని పోలీసులు తెలిపారు. వారిలో ముగ్గురిని మహారాష్ట్ర కంట్రోల్‌ ఆఫ్‌…

ఖమ్మం

మున్సిపల్ సమావేశానికి మీడియాకు నో ఎంట్రీ

కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం మంగళవారం ప్రారంభమైంది. బడ్జెట్ కేటాయింపులు సరిగ్గా లేవని, ప్రాధాన్యతా అంశాలను విస్మరించారని మీడియాలో మంగళవారం కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మీడియాను అనుమతించలేదు.…

Main

రూ. 40 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి

హైదరాబాద్:నాంపల్లి రైల్వే స్టేషన్‌లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి ఆధారాలు లేకుండా ఉన్న రూ.40లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆ సొమ్ముకు సంబంధించి అతని వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో డబ్బును స్వాధీనం…

ఆదిలాబాద్

ఆపరేషన్ చేశారు.. దూది మరిచారు

ఆదిలాబాద్ క్రైం: ఆపరేషన్ కోసం వచ్చిన మహిళ కడుపులో వైద్యులు కాటన్ వదిలేసి అలాగే కుట్లు వేసి పంపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణంలోని…

Main

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి : బంధువుల ఆందోళన

గోదావరిఖని : ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మరణించడంతో అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  గోదావరిఖనికి చెందిన ఆరెళ్లి…

Featured News

ఈవీఎంలపై ఇక అభ్యర్థుల ఫొటోలు

ఇక ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు పెట్టనున్నారు. త్వరలో జరుగనున్న ఆరు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానానికి కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టబోతున్నది. ఎన్నికల కమిషన్ ఈ నెల 16న ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు ఏర్పాటుచేసేందుకు నిర్ణయం…