Monday, 2 November 2026

April 2015

జాతీయం

జోధ్ పూర్ కోర్టులో సల్మాన్…

రాజస్థాన్ : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జోధ్ పూర్ కోర్టుకు హాజరయ్యాడు. అక్రమ ఆయుధాల కేసులో సల్మాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

జాతీయం

కేంద్ర కేబినెట్ ప్రారంభం..

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతనలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీలపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

సీమాంధ్ర

పీజీ మెడికల్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభం..

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లోని పలు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ మెడికల్ సీట్ల ప్రవేశానికి తొలి విడత కౌన్సెలింగ్ విజయవాడలో ఈ రోజు ప్రారంభమైంది.

జాతీయం

భారతదేశానికి చేరుకున్న 300 మంది..

ఢిల్లీ : నేపాల్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నారు. బుధవారం ఉదయం రెండు విమానాల్లో మూడు వందల మంది భారతీయులను తరలించారు. మరోవైపు మృతుల సంఖ్య పెరుగుతోంది. పది వేల వరకు దాటవచ్చని అంచనా వేస్తున్నారు.

జాతీయం

తమిళనాడులో బస్సు బీభత్సం..నలుగురు మృతి.. `

తమిళనాడు : రాష్ట్రంలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. తిరువన్నామళై సమీపంలో అదుపు తప్పిన బస్సు ఇళ్లలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

సీమాంధ్ర

పొలం విషయంలో ఘర్షణ..

పశ్చిమగోదావరి : జిల్లాలో కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో పొలం విషయంలో బంధువుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

సీమాంధ్ర

పాల డెయిరీలో మంత్రి సునీత తనఖీలు..

అనంతపురం : గాయత్రి పాల డెయిరీలో మంత్రి సునీత అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కల్తీ పాలు తయారవుతున్న నేపథ్యంలో మంత్రి ఈ తనిఖీలు నిర్వహించారు.