బలపడుతున్న రూపాయి..
ముంబాయి : డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడుతోంది. 32 పైసలు తగ్గి రూ.62.19 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. దీనితో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
ముంబాయి : డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడుతోంది. 32 పైసలు తగ్గి రూ.62.19 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. దీనితో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
శ్రీకాకుళం : సీతం పేట ఏజెన్సీ ప్రారంతంలో కె.గుమ్మడ తండా సమీపంలో ఏనుగులు పంట పోలాలపై దాడులు చేశాయి. దీనితో బీడీ, అరటి తోటలు ధ్వంసమయ్యాయి.
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలు..ఏపీ రాజధాని భూ సేకరణలపై కోర్టు విచారణ వాయిదా వేసింది. సీజే అందుబాటులో లేనందున కోర్టు వాయిదా వేసింది.
తిరుపతి : రుయా ఆసుపత్రిలో మంత్రి కామినేని శ్రీనివాస్ తనిఖీలు చేశారు. ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించారు.
చిత్తూరు : జిల్లా పీలేరు నుండి కర్నాటకకు తరలిస్తున్న ఐదు ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేశారు.
ముంబాయి : స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ 90 పాయింట్లు..జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 20 పాయింట్లు లాభ పడింది.
ఉత్తర్ ప్రదేశ్ : మీరట్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ఆరుగురు సజీవదహనమయ్యారు.
నల్గొండ : అరవవల్లి గుట్టలు..ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గ్రే హౌండ్స్, పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
మహబూబ్ నగర్ : జిల్లాలోని బల్మూరు మండలం కొండనాగుల వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. డీసీఎం బోల్తా పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్ : జలగం వెంగళరావు పార్కును సోమవారం తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. పార్కులోని చెరువును ఆయన పరిశీలించారు