మిషన్ కాకతీయకు ఎన్నారై విరాళం..
హైదరాబాద్ : మిషన్ కాకతీయకు నల్గొండ జిల్లా సుంకిశాల గ్రామానికి చెందిన ఎన్నారై మల్లారెడ్డి రూ.50లక్షల విరాళం అందచేశాడు. మంత్రి హరీష్ రావును కలిసి చెక్కును అందచేశాడు. పులిగిల్లలోని రాముని చెరువును దత్తత తీసుకున్నాడు.
హైదరాబాద్ : మిషన్ కాకతీయకు నల్గొండ జిల్లా సుంకిశాల గ్రామానికి చెందిన ఎన్నారై మల్లారెడ్డి రూ.50లక్షల విరాళం అందచేశాడు. మంత్రి హరీష్ రావును కలిసి చెక్కును అందచేశాడు. పులిగిల్లలోని రాముని చెరువును దత్తత తీసుకున్నాడు.
ఢిల్లీ : భూ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. అఖిల భారత కిసాన్ సభ, యువ క్రాంతితో పాటు పలు వ్యవసాయ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. భూ సేకరణ…
ఢిల్లీ : పార్లమెంట్ గాంధీ విగ్రహం ఎదుట టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. హైకోర్టు విభజన చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ: కాసేపట్లో బీజేపీ అగ్రనేతలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ భేటీ కానున్నారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, నితన్ గడ్కరీ తదితరులు హాజరుకానున్నారు. పలు కీలక బిల్లుల ఆమోదంకు అనుసరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. పార్టీ జెండాను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.నాగయ్య ఆవిష్కరించి తరగతులను ప్రారంభించారు.
మహబూబ్ నగర్ : రంగాపూర్ వద్ద శ్రీశైలం ముంపు నిర్వాసితులు జాతీయ రహదారిని నిర్భందించారు. సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రహదారి దిగ్భందంతో రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి..
బారాముల్లా : జమ్మూ కాశ్మీర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మీర్ సాహిబ్ ప్రాంతంలో ఉన్న ఓ చారిత్రక కట్టడంలో ఈ ఘటన సంభవించింది.
ముంబై: మంగళవారం స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 68పాయింట్ల నష్టంతో 27,422దగ్గర, నిఫ్టీ 25పాయింట్ల నష్టంతో 8,307దగ్గర ప్రారంభమయ్యాయి..