Tuesday, 3 November 2026

May 2015

జాతీయం

ప్రధాని మోడీ చైనా పర్యటన ఖరారు..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనా పర్యటన ఖరారైంది. జియాన్, బీజింగ్, షాంఘైలలో పర్యటించనున్నారు. మంగోలియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోనూ మోడీ పర్యటించనున్నారు. మంగోలియాలో పర్యటించనున్న తొలి భారత ప్రధాని మోడీ కానున్నారు.

హైదరాబాద్

పంజాగుట్ట అగ్రిగోల్డ్ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన..

హైదరాబాద్ : పంజాగుట్ట అగ్రిగోల్డ్ కార్యాలయానికి పెద్ద ఎత్తున్న బాధితులు చేరుకుని ఆందోళన చేపట్టారు. బాధితులు సోమవారం విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించిన సంగతి తెలిసిందే.

జాతీయం

చెన్నైలో ఐదుగురు మావోయిస్టుల అరెస్టు..

చెన్నై : ఐదుగురు మావోయిస్టులను కోయంబత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో కేరళకు చెందిన రూపేశ్ తో పాటు నలుగురి అరెస్టు చేశారు. రూపేశ్ కు తమిళనాడు కేరళ, ఏపీ రాష్ట్రాల్లో 20కి పైగా కేసులున్నాయి.

Main

సైనిక నిమామక ర్యాలీ..

ఆదిలాబాద్: ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సైనిక నియామక ర్యాలీని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న ప్రారంభించారు.

Main

నేడు ఆర్టీసీ నేతలతో ఎండీ చర్చలు..

హైదరాబాద్: గుర్తింపు పొందిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఆ శాఖ ఎండీ సాంబశివరావుతో చర్చలు జరపనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుంది. తమ డిమాండ్ల సాధన కోరుతూ బుధవారం నుండి కార్మికులు సమ్మె చేపట్టనున్నట్లు…

అంతర్జాతీయం

పపువాలో భారీ భూకంపం..

న్యూగినియా : పపువాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.5గా నమోదైంది. భూకంపం కేంద్రానికి 300 కి.మీ.దూరంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

సీమాంధ్ర

తిరుపతిలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఎనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటలు..కాలినడకన వచ్చే భక్తులకు నాలుగు గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

Main

జుమ్మెరాత్ బజార్ లో కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : షాహినాథ్ గంజ్ పీఎస్ పరిధిలో జమ్మెరాత్ బజార్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఆరుగురు రౌడీషీటర్లు..20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. రెండు వేల…