Wednesday, 4 November 2026

June 2015

వార్తలు

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఐదుగురి మృతి 

చిత్తూరు: తిరుపతి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. రేణిగుంట మండలం మామండూరు వద్ద టాటా సుమో అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక…

వరంగల్

సద్గురు శివానందమూర్తి కన్నుమూత

వరంగల్‌:జిల్లాలోని ములుగులో ఆధ్యాత్మిక గురువు సద్గురు శివానందమూర్తి(87) కన్నుమూశారు. శివానందమూర్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సద్గురు శివానందమూర్తి స్వస్థలం విజయనగరం జిల్లా. ఇవాళా ఉదయం 8.30 గంటల తర్వాత భక్తుల సందర్శనార్ధం ఆశ్రమంలో శివానందమూర్తి భౌతికకాయం ఉంచనున్నారు.…

జాతీయం

నేడు రాష్ట్రపతి ప్రణబ్ తో గవర్నర్ నరసింహన్ భేటీ..

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. ఏడాది పాలన, రెండు రాష్ట్రాల పరిస్థితులను గవర్నర్ కేంద్రానికి విరించనున్నారు.

జాతీయం

ఇవాళా సా.4గంటలకు చంద్రబాబుకు మోడీ అపాయింట్ మెంట్

ఢిల్లీ: ఎపి సీఎం చంద్రబాబుకు ఇవాళా సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చంద్రబాబు మోడీకి వివరించనున్నారు. ఎపి, తెలంగాణ మధ్య నెలకొన్న పరిస్థితులపై మోడికి పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించనున్నారు.

జిల్లా వార్తలు

తిరుపతిలో భారీ వర్షం

చిత్తూరు: తిరుపతి నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. మరో వైపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్

మోడల్ స్కూల్స్ లో ప్రేవేశాలకు ఉత్తర్వులు జారీ..

హైదరాబాద్: మోడల్ స్కూల్‌లో ప్రవేశాల కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6వ తరగతి నుంచి 10 తరగతి వరకు ఎంట్రెన్స్ నిర్వహించాలని, ఇంటర్‌లో పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

హైదరాబాద్

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిరాధారం:ఏకేఖాన్

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ ను ట్యాప్ చేశారన్న ఆరోపణలు తెలంగాణ ఏసీబీ ఖండించింది. ఏసీబీ ఏ కేసునైనా చట్టబద్ధంగానే దర్యాప్తు చేస్తుందని ఆ సంస్థ డీజీ ఏకే ఖాన్ స్పష్టం చేశారు