Tuesday, 3 November 2026

June 2015

హైదరాబాద్

చంద్రబాబుతో సుజనాచౌదరి-ఐవైఆర్ కృష్ణారావు భేటీ.. 

హైదరాబాద్: సీఎం చంద్రబాబుతో కేంద్రమంత్రి సుజనాచౌదరి, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ పర్యటనపై చర్చ జరుగనుంది.

Main

వరంగల్ లో భట్టివిక్రమార్క పర్యటన 

వరంగల్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు సీఎంలు అధికారం అడ్డుపెట్టుకుని ఆటలాడుతున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల్లో చంద్రులు అధికారంలోకి రావడం… ప్రజల దురదృష్టమని చెప్పారు. ఆరు దశాబ్ధాల పోరాట…

హైదరాబాద్

నేడు ఎపి కేబినెట్ అత్యవసర భేటీ… 

హైదరాబాద్: ఇవాళా ఉదయం 11 గంట‌ల‌కు ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. తాజా ప‌రిణామాలు, చంద్రబాబు ఫోన్ టేపుల వ్యవహారంపై కేబినెట్ చర్చించనుంది. తెలంగాణ ప్రభుత్వ చ‌ర్యలు, అనుస‌రించాల్సిన వ్యూహంపై చర్చ జరుగనుంది. హైదరాబాద్‌ శాంతి భ‌ద్రత‌లు గ‌వ‌ర్నర్‌కు…

Main

నిజామాబాద్ జిల్లాలో నేడు సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ.. 

నిజామాబాద్: బీడీ కార్మికులకు ఆంక్షలు లేకుండా రూ.వెయ్యి భృతి చెల్లించాలని నేడు సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీకి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరుకానున్నారు.

హైదరాబాద్

హైదరాబాద్ లో చేపమందు పంపిణీ.. తొక్కిసలాట

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీ చేస్తున్నారు. ప్రజలు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగి.. పలువురికి గాయాలయ్యాయి. చేప మందు పంపిణీ రాత్రి వరకు కొనసాగనుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్

ఓటుకు నోటు కేసులో ఎసిబి దూకుడు..

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎసిబి దూకుడు పెంచింది. ఓటుకు నోటు కేసులో నిందితులు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, విజయసింహ ఇళ్లల్లో ఎసిబి అధికారులు తనిఖీలు చేశారు. మూడు రోజురుల విచారణ ఆధారంగా ఎసిబి ముందుకుసాగుతోంది.

సీమాంధ్ర

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా-20 మందికి గాయాలు 

నెల్లూరు: కోవూరు సాయిబాబా ఆలయ సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్

నేడు ఎపి ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు…

హైదరాబాద్:నేడు ఎపి ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం 5గంటలకు ఫలితాలు వెల్లడికానున్నాయి.