Tuesday, 3 November 2026

June 2015

సీమాంధ్ర

బైక్ ను ఢీ కొట్టిన లారీ: ఇద్దరి మృతి 

తూ.గో: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం సముదివారిలంక గ్రామ పంచాయతీ సమీపంలో జరిగింది.

సీమాంధ్ర

ఇరు రాష్ట్రాల సీఎంలవి దిగజారుడు రాజకీయాలు: రామకృష్ణ 

విశాఖ:తెలుగు రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులిద్దరూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని సీపీఐ నాయకుడు రామకృష్ణ ఆరోపించారు. ఆయన విశాఖలో మాట్లాడుతూ…ఇద్దరూ వ్యక్తిగత లాభాల కోసం పాకులాడుతున్నారన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. ఏపీలో ఏడాది…

హైదరాబాద్

12న టీఎస్ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధాన సదస్సు 

హైదరాబాద్: ఈనెల 12న తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధాన సదస్సు జరుగనుంది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఈమేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్‌ఐసీసీలో జరుగుతోన్న ఏర్పాట్లను పరిశీలించారు.

హైదరాబాద్

ముగిసిన రేవంత్ రెడ్డి ఏసీబీ కస్టడి 

హైదరాబాద్:ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు టి.టిడిపి నేత రేవంత్ రెడ్డితో పాటు సహ నిందితులు సెబాస్టియన్, ఉదయ సింహలకు ఏసీబీ కస్టడీ గడువు ముగిసింది. కోర్టు అనుమతితో నాలుగు రోజుల క్రితం ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న…

హైదరాబాద్

ముగిసిన దాశరథి అంత్యక్రియలు 

హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సాహితీ శిఖరం దాశరథి రంగాచార్య అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‌ వెస్ట్ మారేడ్‌ పల్లిలోని శ్మశాన వాటికలో, అధికార లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దాశరథిని కడసారి చూసేందుకు అభిమానులు, మేధావులు పెద్ద…

హైదరాబాద్

చంద్రబాబు ఫోన్‌ ను మేం ట్యాప్‌ చేయలేదు:కడియం 

హైదరాబాద్: చంద్రబాబు ఫోన్‌ను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్‌ చేయలేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. స్టీఫెన్‌ సన్‌ ఫిర్యాదు మేరకు ఏసీబీ వాయిస్‌ రికార్డు చేసిందని చెప్పారు. తన పంచాయితీని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చేందుకు…

హైదరాబాద్

రేవంత్‌రెడ్డి ఇంట్లో ముగిసిన ఏసీబీ సోదాలు ]

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఆయన నివాసంలో హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ అన్నారు. కీలక ఆధారాలు లభ్యం కాలేదని చెప్పారు. ఈ రోజు సాయంత్రం…

హైదరాబాద్

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న కేసీఆర్-జగన్: రావెల 

హైదరాబాద్: ఎపి రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్, జగన్ లు అడ్డుకుంటున్నారని మంత్రి రావెల కిషోర్ బాబు మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ లతో కేసీఆర్ రాజకీయవ్యభిచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుపై అసత్యప్రచారం చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.

హైదరాబాద్

చంద్రబాబు సీఎం పదవికి రాజీమనా చేయాలి:బాల్క సుమన్

హైదరాబాద్:చంద్రబాబు సీఎం పదవికి రాజీమనా చేయాలని టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. చంద్రబాబు వ్యవహారం.. దొంగనే దొంగ అన్నట్లుందని చెప్పారు. చంద్రబాబు.. అవినీతి సామ్రాట్ అని ఆరోపించారు. అవినీతి నేతలను ప్రశ్నిస్తానన్న జనసేన పార్టీ అధ్యక్షుడు…

హైదరాబాద్

కొనసాగుతున్న ఎపి కేబినెట్ సమావేశం… 

హైదరాబాద్: ఎపి కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ ను ఖండిస్తూ… కేబినెట్ తీర్మానించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శాంతి భద్రతలను గవర్నర్ కు అప్పగించాలని తీర్మానిస్తూ.. కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డికి అండగా ఉండాలని నిర్ణయం తీసుకొకున్నారు.…