నేడు ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభం..
విజయవాడ : రాజధాని అమరావతి భూమి పూజ అనంతరం విజయవాడలోని సీఎం క్యాంపు ఆఫీసును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు
విజయవాడ : రాజధాని అమరావతి భూమి పూజ అనంతరం విజయవాడలోని సీఎం క్యాంపు ఆఫీసును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు
ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి మోడీ బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ : నేడు ఢాకా – అగర్తల బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో బంగ్లాదేశ్, భారత ప్రధానులు షేక్ హసినా, మోడీలు పాల్గొనున్నారు.
గుంటూరు : నేడు ఏపీ రాజధాని అమరావతికి భూమి పూజ జరుగనుంది. ఉదయం 8.49 నిమిషాలకు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు భూమి పూజ చేయనున్నారు. భూమి పూజ అనంతరం 100 ట్రాక్టర్లతో భూమి చదును చేయనున్నారు. ఈ…
చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 22 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 11గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు ఐదు గంటల సమయం పడుతోంది.
నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. సెరెనా విలియమ్స్ తో లూసీ సఫరోవా తలపడనుంది. సాయంత్రం 6.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఢిల్లీ : భారత ప్రధాని మోడీ నేడు బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరనున్నారు.
ఢిల్లీ : నేడు ఉద్యోగుల విభజనపై కమల్ నాథన్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎస్ లు హాజరు కానున్నారు. 16 శాఖల ఉద్యోగుల విభజనపై చర్చ జరగనుంది.