Tuesday, 3 November 2026

టీ బిల్లులో 21 సవరణలు కోరిన బీజేపీ

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదంకు వచ్చిన సమయంలో బీజేపీ మెలికలు పెడుతోంది. ఈ మేరకు ఇవాళ బీజేపీ జాతీయనేత వెంకయ్య నాయుడు మీడియాలో బీజేపీ మెలికలు పెడుతోంది. ఈ మేరకు ఇవాళ తో మాట్లాడారు. ఇవాళ ఉదయం నుంచి కేంద్ర ప్రభుత్వం తమతో విభజన బిల్లు విషయంపై రెండుమూడు సార్లు సంప్రదింపులు జరిపిందని వెల్లడించారు. దానికి తాము 21 వరకు సవరణలు సూచించామని వెంకయ్య తెలిపారు. ఈ సవరణలు చేసేందుకు ప్రభుత్వం వెనకాడుతోందని వెల్లడించారు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో రేపు చూద్దామని అన్నారు. బిల్లులో సవరణలతో లోక్‌సభరే వస్తే తాము మళ్లీ మద్దతిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ అనుకూలమని చెప్పారు. అయితే రాష్ట్ర విభజనను సామరస్యపూర్వకంగా జరపడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

సీమాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి: వెంకయ్య
సీమాంధ్రకు పదివేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరనున్నారు. ప్యాకేజీలు సీమాంధ్ర సమస్యలను తీర్చవని పేర్కొన్నామని వివరించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ శాంతి భద్రతలు గవర్నకు ఇస్తే రాజ్యంగ నియమాలు ఒప్పుకోదని తెలిపామన్నారు. ఇందుకు మళ్లీ లోక్‌సభకు పంపాల్సి వస్తుందని జైరాం రమేష్‌ అన్నారని, అయినా సరేతాము లోక్‌సభలో మళ్లీ మద్ధతిస్తామని ఆయనతో తెలిపామన్నారు. అసలు లోక్‌సభలో బిల్లు పెట్టేకంటే ముందే తాము సవరణలు సూచించామని సవరణతో చేరుకచతున్నట్టు కాంగ్రెస్‌ నమ్మబలికిందని వివరించారు. అసలు విభజన సమస్యలపై కేంద్ర మంత్రులకే అవగాహనలేదని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *