23న చలో విజయవాడ జయప్రదం చేయండి

విజయనగరం,మే18(జ‌నం సాక్షి ): ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 23 తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ రౌండ్‌ టేబుల్లో సమావేశంలో వక్తలు పిలుపు నిచ్చారు. జన ఆందోళన ఐక్యవేధిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. అధికారంలోకి రాక ముందు అనేక వాగ్దానాలు చేసిన మోడీ నేటికి వాటిని అమలు చేయలేదని విమర్శించారు. మహిళలు విూద దాడులు, దళితులపై దాడులు, రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక¬దా ఇవ్వాలని కోరుతూ, 23 తేదీనాటికి 4 ఏళ్ల పాలన సందర్భంగా చలో విజయవాడ కార్యక్రమంలో కార్మికులు, ప్రజలు పాల్గని జయప్రదం చేయాలన్నారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ, అధ్యక్షులు ఎం.శ్రీనివాస,ఎ ఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వి.కఅష్ణంరాజు, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు బి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.