Tuesday, 3 November 2026

23 ఏళ్ల ఉద్యోగ జీవితం.. 45 సార్లు బదిలీ!

f4w30ptcప్రజా వేగుగా పేరున్న ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాను హర్యానా ప్రభుత్వం మరోసారి బదిలీ చేసింది. 23 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఆయన బదిలీ కావడం ఇది 45వ సారి. ఐతే గతంలో ఖేమ్కా బదిలీని వ్యతిరేకించిన బీజేపీ పాలకులే ఇప్పుడు ఆయన బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, డీఎల్ ఎఫ్ మధ్య జరిగిన ఒప్పందం సహా ఎన్నో కుంభకోణాలను ఖేమ్కా బయటపెట్టారు. కాగా ఖేమ్కా బదిలీపై హర్యానా మంత్రి అనిల్ విజ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ అంశంపై తాను సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో మాట్లాడుతానని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *