పి.వి. నర్సింహ రావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం మమూనూర్, వరంగల్ జిల్లా మరియు పశువైద్య మరియు పశుసంవర్థక శాఖ జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో పశుధన్ జాగృతి అభియన్ లో భాగంగా 16-09-2023 (శనివారం) నాడు కాటారం గ్రామంలో ప్రత్యేక పశువైద్య శిబిరం మరియు పాడి రైతుల అవగహన శిబిరం నిర్వహించడం కోసం కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మరియు అధిపతి డా.ఎన్.రాజన్న మరియు శాస్త్రవేత్తలు కాటారం గ్రామాoలొ ప్రత్యేక పశు వైద్య శిబిరం మరియు పాడి రైతుల అవగాహన శిబిరం నిర్వహించడం కోసం సందర్శించడం
జరిగినది. కార్యక్రమంలో భాగంగా భాగంగా భూపాల్ పల్లి జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక అధికారి డాక్టర్ రంగారావు మరియు స్థానిక పశు వైద్యాధికారి డాక్టర్ రాకేష్ శర్మ గార్లతో కలిసి కరపత్రం విడుదల చేయడం జరిగినది. డాక్టర్ రాజన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ పశు వైద్య శిబిరంలో ఉచితంగా పశువులకు పరీక్షలు చేసి మందులు పంపని చేస్తారు మరియు అవగాహన శిబిరంలో శాస్త్రవేత్తలచే పశువుల లో పునరుత్పత్తి యాజమాన్యం పైన అహగణ కల్పించడం జరుగుతుంది అని తెలియజేశారు.