డాక్టర్ ప్రీతి భద్రరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
సికింద్రాబాద్ ఆర్.సి జనం సాక్షి సెప్టెంబర్ బోయినపల్లి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి భద్రరెడ్డి పుట్టినరోజు సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఆర్.టింకు గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలునిర్వహించారు,తదనంతరం పండితులు వేద మంత్రాలతో డాక్టర్ ప్రీతి రెడ్డి ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేయడం జరిగింది. అనంతరం బోయినపల్లి బిఆర్ఎస్ పార్టీ యువనాయకులు ఆర్.టీంకుగౌడ్,మరియు దినేష్,రవళిక డాక్టర్ ప్రీతి రెడ్డి ని పూలబొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.