Tuesday, 3 November 2026

పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి ఎమ్మెల్యే అబ్రహం
అలంపూర్ సెప్టెంబర్ 18( జనంసాక్షి )సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అని అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం అన్నారు. సోమవారం అలంపూర్ మున్సిపాల్టీ పరిధిలోని షాహీన్ భర్త అబ్దుల్లా కి సీఎం సహాయ నీది ద్వార మంజూరు అయిన 3.60 లక్షల రూపాయల చెక్కును మరియు కె . శలమ్మ భర్త నాగరాజ్ కి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 1 లక్ష రూపాయల చెక్కును బాధితులకు నేరుగా వారి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే అబ్రహం వారికి చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు .ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు అని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎం సహాయ నిధి కింద చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తూ గాయపడిన వారు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలను పొందేందుకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందజేస్తోందని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సీఎం సహాయ నిధి చెక్కులను అందజేస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల చైర్మన్లు,వైస్ చైర్మన్లు మరియు మండల స్థాయి ప్రజా ప్రతినిదులు మరియు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..