మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్ నేతలు.
తాండూరు సెప్టెంబర్ 20(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా యాలాల మండలం గొర్రెపల్లి మాజీ సర్పంచ్ రవి గౌడ్ మాతృమూర్తి పద్మావతి గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం స్వర్గస్తులయ్యారు. బుధవారం సమాచారం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ యాలాల మండ లం నేతలు గొరేపల్లి గ్రామానికి చేరుకొని మృతురాలు పద్మావతి పార్టీవ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ పరామర్శించారు.ఈ కార్యక్రమంలో దేవనూరు గ్రామ సర్పంచ్ ఆకుల శివకుమార్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మెట్లీ ఆశన్న, ఏఎంసి డైరెక్టర్ మంత్రి వెంకటయ్య, బిఆర్ఎస్ యువ నాయకులు బోడుక మల్లేశం తదితరులు ఉన్నారు.




