Saturday, 7 November 2026

24న విడుదల కానున్న తెరాస ఎన్నికల ప్రణాళిక

 

సిఎం కెసిఆర్‌తో కెకె చర్చలు

హైదరాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): అన్ని పార్టీల ఎన్నికల ప్రణాళికలూ వరసగా విడుదలవుతున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రసమితి తన తుది ప్రణాళిక సైతం వెలువరించేందుకు రంగం సిద్ధంచేస్తోంది. ఇప్పటికే తాత్కాలిక ప్రణాలికను విడుదల చేశారు. దీంతో తుది ప్రణాళికను ఈ నెల 24న వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెదేపా మేనిఫెస్టో బుధవారం విడుదల కాగా, కాంగ్రెస్‌ ప్రణాళిక

23న వెలువడనుంది.తెరాస ఎన్నికల ప్రణాళిక కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సీఎం ఇప్పటికే నియోజకవర్గాల పర్యటనలు ప్రారంభించారు. ఈ 24న మినహా మిగిలిన రోజుల్లో సభలున్నాయి. దీంతో, ఆ రోజునే మేనిఫెస్టో విడుదల చేస్తారన్న అంచనాలున్నాయి. ఇప్పటికే ఎన్నికల పాక్షిక ప్రణాళికను సీఎం వెలువరించారు. ఇందులో కీలకమైన 9 హావిూలను వెల్లడించారు. తుది ప్రణాళికపై సుదీర్ఘమైన కసరత్తు సాగింది. కేకే ఆధ్వర్యంలో ప్రధాన కమిటీ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని ఎస్సీ,ఎస్టీ ప్రణాళిక కమిటీలు తమ ప్రతిపాదనలను సిద్ధం చేసి సీఎంకు అందజేశాయి. వాటిపైనా ఆయన చర్చించారు.