కాబూల్ : గడచిన 24 గంటల్లో సైన్యం చేపట్టిన అపరేషన్లలో 57 మంది తాలిబన్లు హతమైనట్లు ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఆర్మీ, నాటో దళాలతో కలిసి ఆఫ్ఘస్ పోలీసులు చేపట్టిన ఈ అపరేషన్‌లో గాయపడ్డ ఎనిమిది మంది తాలిబన్లతోపాటు మరో 12 మంది తాలిబన్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాందహార్, గజ్ని , హెల్‌మాండ్, కపీసా, పక్తికా , పాక్టియా రాష్ట్రాల్లో రక్షణ దళాలు ఈ అపరేషన్‌ను చేపట్టాయి. ఈ సందర్భంగా భద్రత దళాలు రహదారులవెంట వాహనాలను పేల్చేందుకు మిలిటెంటు గ్రూపులు పెట్టిన పలు మందుపాతరలను నిర్వీర్యం చేశాయి.




