Monday, 2 November 2026

24న టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష భేటీ

హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం భేటీకానుంది. ఈమేరకు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి తెలిపారు. ఈనెల 24వ తేదీన తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమవుతారని ఆయన పేర్కొన్నారు. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు. ఆయా జిల్లాల సమస్యలను సీఎం స్వయంగా నేతలను అడిగి తెలుసుకుంటారని సుభాష్‌రెడ్డి వివరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *