తెలంగాణ సీఎం కేసీఆర్
హైదరాబాద్: పోలీసు అమరుల త్యాగాలు అమూల్యమైనవి, వెలకట్టలేనివని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గోషామహల్‌లోని శివకుమార్‌లాల్ పోలీస్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణదినోత్సవంలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు… ఏటా అమరులను స్మరించుకోవడం మంచి సంప్రదాయమన్నారు. మీడియా, సినిమా వాళ్లు పోలీసులను కించపరిచేలా చూడటం, మాట్లాడటం సరికాదన్నారు. పోలీసు వ్యవస్థను చెడుగా చూడటం దేశానికే మంచిదికాదన్నారు. విధి నిర్వహణలో అమరులైన వారు దేవునితో సమానం… అమరుల కుటుంబాలకు వందశాతం అండగా ఉంటామని సీఎం స్పష్టం చేశారు. భద్రత ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, సింగపూర్ తరహాలో భద్రత మరింత పటిష్ఠం చేస్తామన్నారు. ధన, మాన, ప్రాణ రక్షణలో పోలీసులు విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అమరుల త్యాగాలు వెలకట్టలేనివి





