రాపూర్ : నెల్లూరు జిల్లా రావూర్ మండలం పెంచలకోనలోని వెలిగొండ అటవీప్రాంతంలో తమిళనాడుకు చెందిన 25 మంది ఎర్రచందనం కూలీలను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా అడవుల్లో ఎర్రచందనం నరికి తిరుగు ప్రయాణం అవుతుండగా కూలీలను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం మద్దెలమడుగు వద్ద ఉన్న చెక్‌పోస్టు వద్దకు తరలించి విచారణ చేపట్టారు. వీరి వద్ద నుంచి సెల్‌ఫోన్లు, ఎర్రచందనం విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.




