హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా ఒడిశా రాష్ట్రం అతలాకుతలమవుతోంది. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. మహానది ఉగ్రరూపం దాల్చింది. నదుల్లో పోటెత్తుతోన్న వరద నీరు 13 జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. ఈ వరదల్లో 25 మంది మృతిచెందారు. కాగా, మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.




