Monday, 2 November 2026

షూటింగ్‌ చూసేందుకు ఎగబడ్డ జనం.. భారీగా ట్రాఫిక్ జాం

హైదరాబాద్: సినిమా షూటింగ్‌ జరుగుతుందంటే చాలు చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ ఆ అభిమానం సాధారణ జనజీవనానికి ఆటంకాలు సృష్టిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో రెండు రోజులుగా ఓ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమా చూసేందుకు స్టూడియో ముందు నుంచి వెళ్లే ద్విచక్ర వాహనదారులు అభిమానంతో చూసేందుకు ఎగబడ్డారు. దీంతో వాహనాలు నడిరోడ్డు మీద వరకు ఆగాయి. ఫలితంగా ట్రాఫిక్‌ తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 5 దారి మూసేయడంతో వాహనాలు అన్నపూర్ణ స్టూడియో మీదుగా మళ్లిస్తున్నారు. దీంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. ట్రాఫిక్‌ పోలీసులు స్పందించి ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చేయాలని వాహన చోదకులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *