హైదరాబాద్, జూన్ 26 : సత్యం కుంభకోణం కేసు విచారణ ముగిసింది. జులై 28న తీర్పు తేదీ ప్రకటించనున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం స్పష్టం చేసింది. కేసు విచారణకు సత్యం రామలింగరాజు సహా నిందితులందరూ హాజరయ్యారు.
ఈ నెల 23న సత్యం కుంభకోణం కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సత్యం రామలింగరాజుతో పాటు ఇతర నిందితులను కోర్టు దోషులుగా నిర్దారించింది. ఈ కేసులో తుది తీర్పును కోర్టు ఈనెల 26కు వాయిదా వేసిన విషయం విదితమే.




