హైదరాబాద్: నగరంలోని గురుకుల ట్రస్టు భూముల్లో వెలసిన అక్రమ కట్టడాలన్నింటిని కూల్చివేసి ఆ భూములను ప్రభుత్వం పేదలకు పంచాలని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… గురుకుల ట్రస్టు భూముల్లో ప్రభుత్వం పేదల ఇళ్లను మాత్రమే కూలగొట్టి ధనవంతుల ఇళ్లను వదిలేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అక్రమ కట్టడాలన్నింటిని కూల్చివేయాలన్నారు. అదేవిధంగా సెజ్‌లకు కేటాయించిన భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.




