నస్పూర్‌కాలనీ(ఏసీసీ),జనంసాక్షి : ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 29 నుంచి పది రోజుల పాటు జిల్లా నృత్య సమాఖ్య ఆధ్వర్యంలో తూర్పు జిల్లాలో నృత్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు అశోక్‌రావు పేర్కొన్నారు. సోమవారం నస్పూర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నృత్య వారోత్సవాలు తూర్పు జిల్లాల్లో జన్నారం నుంచి కాగజ్‌నగర్ వరకు ప్రతి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రదర్శించే నృత్యాలు వారోత్సవాల ప్రారంభం రోజు మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా నుంచి బాలుర ఉన్నత పాఠశాల వరకు కళాకారులతో ర్యాలీ ఉంటుందన్నారు. కార్యక్రమానికి జిల్లాలోని ఉన్నత పాఠశాల వరకు కళాకారులతో ర్యాలీ ఉంటుందన్నారు. కార్యక్రమానికి జిల్లాలోని ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, కళాకారులు అందరు హాజరవుతున్నట్లు తెలిపారు. నృత్య వారోత్సవాలకు నృత్య కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్తొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సమాఖ్య ఉపాధ్యక్షుడు చొప్పదండి దుర్గ, రామగిరి అర్జున్, కొండపర్తి సది, ఎ.లక్ష్మణ్, మంథిని సురేందర్, వాసు పాల్గొన్నారు.




