భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో సంబల్‌పూర్ జిల్లాలో నిన్న జరిగిన పడవ మునక ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. మహానదిలో గల్లంతైన వారి కోసం రక్షణా దళాల గాలింపు చర్యలు కొనసాగుతూనేఉన్నాయి. నిన్న సంబల్‌పూర్ లయన్స్ క్లబ్ చెందిన 120 మందికి పైగా సభ్యులు పీతావల్లికి విహరయాత్ర కోసం వెళ్లి మహానదిలోని కొండను చూసి మూడు పడవల్లో తిరిగి వస్తుండగా ఓ పడవ మునగడంతోీ ప్రమాదం చోటు చేసుకుంది.




