హైదరాబాద్: పెట్రోల్ వినియోగదారునికి తెలియకుండా బంకుల యజమానులు వారి జేబులకు చిల్లు పెడుతున్నారు రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల్లో భారీ మోసం జరుగుతుందని పోలీసులు గుర్తించారు. వాళ్లు అరెస్టు చేసిన నిందితుల సమాచారం ఆధారంగా పలు బంకులపై రైడ్ చేశారు. పెట్రోల్ బంకుల్లో చిప్పులు అమర్చి మోసం చేస్తున్నట్టు గుర్తించారు. నిందితులు చిప్పులు అమర్చిన బంకుల డేటాను సేకరించారు. ఇప్పటి బంకులకు చిప్పులు అమర్చేందుకు ఇప్పందం కుదుర్చుకున్నారని అధికారులు వెల్లడించారు. వాటిపై కూడా రైడ్ చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.




