Tuesday, 3 November 2026

మూజువాణి ఓటుతో 3 రాష్ట్రాలు ఏర్పాడ్డాయి

హైదరాబాద్‌: గతంలో మూజువాణి  ఓటుతో మూడు రాష్ట్రాలు ఏర్పాడ్డాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణాకావు తెలిపారు. తెలంగాణభవన్‌లో జూపల్లి మీడియాతో మాట్లాడుతూ సభలో సభ్యులు ఆందోళన చేస్తే వాళ్లను సస్పెండ్‌ చేసైనా కేంద్రం టీ బిల్లుపై ముందుకు పోవాలి. సీమాంధ్ర నేతలు కుట్రలు చేస్తున్నారు. బీజేపీ ద్వారా తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సీమాంధ్ర నేతలు ప్రలోభాలకు బీజేపీ లొంగదనే భావిస్తున్నాం. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్ని దీక్షలు చేసినా తెలంగాణను ఆపలేడని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *