Tuesday, 3 November 2026

‘పార్లమెంట్‌లో బిల్లును ఆమోదింపజేసుకుంటం’


హైదరాబాద్‌: అందరి మద్ధతుతో పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఆమోదింప జేసుకుంటమని పొలిటికల్‌ జేఏసీ ఛైర్మెన్‌ ప్రొ.కోదండరాం తెలిపారు. జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం ముగింపు అనంతరం ప్రొ.కోదండరాం మాట్లాడుతూ ఉద్యమశక్తులమంతా ఐక్యంగా ఉన్నాం. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు.
సుష్మాస్వరాజ్‌ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు. టీ బిల్లుకు మద్దతు ఉంటుందని బీజీపీ స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తుది దశలో ఉన్నందున సీమాంధ్ర నేతలు సృష్టిస్తున్న అడ్డంకులను కలిసికట్టుగా ఉంటూభగ్నం చేయాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *