నవంబర్‌3 నుంచి ‘అంబేత్కర్‌’ డిగ్రీ పరీక్షలు

హైదరాబాద్‌: నవంబర్‌ 3 నుంచి అంబేత్కర్‌ ఓపెన్‌వర్సిటీ డిగ్రీ కోర్సులు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కోన్నారు. అక్టోబర్‌ 15 లోగా ఫీజులు చెల్లించాలని కోరారు. ఫీజును రాష్ట్రంలోని ఏదైనా ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రంలో చెల్లించొచ్చని తెలిపారు. డిగ్రీ కోర్సు బీఏ, బీకాం, బీఉస్సీ మూడో సంవత్సర పరీక్షలు నవంబర్‌ 3నుంచి, మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్‌ 10నుంచి, రెండవ సంత్సరం పరీక్షలు 15 నుంచి 20 వరకు, నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కోన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం హెల్ప్‌ డెపస్క్‌ 040-23680567, 23680568 నెంబర్లను సంప్రదించండి.

తాజావార్తలు