అకాల వర్షాలపై మంత్రి రఘువీర వెల్లడి
హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు రూ. 3 వేల కోట్ల నష్టం వాటిల్లిందని మంత్రి రఘువీరరెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.1.50 లక్షలు. 18 ఏళ్లు పైబడినవారికి ఆపద్బంధు కింద మరో రూ. 50 వేల పరిహారం అందించాల్సిందిగా మంత్రి కల్టెర్లకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో పెండింగ్‌లో ఉన్న పెట్టుబడి రాయితీని తక్షణం విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. వర్షం కారణంగా 48,500 ఇళ్లు దెబ్బతిన్నాయని, వచ్చే రచ్చబండలోపు ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. బ్యాకంర్లతో మాట్లాడి రైతుల రుణాలు రీషెడ్యులు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు.




