హైదరాబాద్ : మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు 14 గెట్లను మూసింది. సుప్రీంకోర్టు అదేశాల మేరకు గడువు ముగిసిన దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం గేట్లను మూయించింది. సుప్రీంకోర్టు అదేశాల మేరకు నేటినుంచి 8 నెలల పాటు గేట్లు మూసివేస్తారు. బాబ్లీ గేట్ల మూసివేత దృష్ట్యా నాందెడ్, బిలోలి, ధర్మాబాద్ ప్రాంతాల్లో భారీగా పోలీసు బందెబస్తు ఏర్పాటుచేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహన్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌లు బాబ్లీ గేట్ల మూసివేత కార్యక్రమంఆనికి హాజరయ్యారు.




