Monday, 2 November 2026

ఊరూరా ఉద్యమానికి ప్రణాళిక సిద్ధం టీ.కాంగ్రెస్..

sr9b166tహైదరబాద్ : ఇక సమరమే అంటోంది టీ కాంగ్రెస్.. ప్రభుత్వ వ్యతిరేకత కార్యక్రమాలపై పోరాటానికి సిద్ధమైంది.. ఊరూవాడా నిరసనలతో హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు హస్తం నేతలు… త్వరలో ఊరూరా ఉద్యమానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ముప్పేట దాడిచేసేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ… ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తోంది… ధర్నాలు, ఆందోళనలో సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు హస్తం నేతలు.గాంధీభవన్లో జరిగిన పీసీసీ కో ఆర్డినేషన్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు టీ కాంగ్ నేతలు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు. చీప్ లిక్కర్‌పై సమరభేరి మోగించాలని డిసైడయ్యారు.. గ్రామాలనుంచి రాష్ట్రస్థాయివరకూ ఆందోళనలు చేపట్టాలని భేటీలో తీర్మానించారు.. అటు సాగునీటి ప్రాజెక్టులపై కూడా కేసీఆర్ సర్కారుపై యుద్ధానికి సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ.. డిజైన్ మార్పుల వెనక పెద్ద తతంగం ఉందని ఇప్పటికే ఆరోపించిన నేతలు… ఈ అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేయాలని నేతలు భావిస్తున్నారుఅటు నిత్యావసరాల ధరల పెరుగుదలపై కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టాలని హస్తం నేతలు నిర్ణయించారు.. ప్రజల పక్షాన జనంతో కలిసి ఆందోళనలు చేపట్టాలని చూస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్న టీకాంగ్ నేతలు… కేసీఆర్ సర్కారుపై దాడికి… అన్ని అస్త్రాలు రెడీ చేసుకున్నారు. ప్రణాళిక బాగానే ఉన్నా… ఉద్యమ వ్యూహంపైనే వీటి సక్సెస్ ఆధారపడి ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *